వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలి

జాగృతి నాయకుడు కూర సురేష్

గంభీరావుపేట ఏప్రిల్ 08 (జనం సాక్షి):రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని లక్ష్మిపూర్ తండా. నాగంపేట దమ్మన్నపేట తో పాటు పలు గ్రామాలలో రైతులు కోత కోసి ధాన్యం 15 రోజులుగా ఆరబెట్టుకుంటున్నారు. ధాన్యం ఆరబెట్టుకుంటుకొన్న కళ్ళల్లో ధాన్యాన్ని జాగృతి నాయకులు కూర సురేష్ సందర్శించి రైతులతో మాట్లాడారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలతో పాటు లక్ష్మిపూర్ తండా . నాగంపేట దమ్మన్నపేట తో పాటు అనేక గ్రామాలలో రైతులు ముందస్తు సాగు చేసుకుని వరి కోతలు కోసి దాన్యమును కొనుగోలు కేంద్రాలలోకి తీసుకువచ్చి ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అకాల వర్షాలు కురిస్తే రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారని జిల్లా మండల అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ పరిశీలనలో రైతులు. పాల్గొన్నారు.

తాజావార్తలు