ఎన్నికైన కో ఆప్షన్ సభ్యులకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి) : భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కో-ఆప్షన్ ఎన్నికల్లో జనరల్ కేటగిరీ కో-ఆప్షన్ సభ్యుడిగా సజ్జనపు స్వామి, మహిళా కేటగిరీలో చల్లా రేణుక, మైనారిటీ జనరల్ కేటగిరీలో ఎం.డి అబ్దుల్ హఫీజ్, మైనారిటీ మహిళా కేటగిరీలో ఎం.డి మిన్హాజ్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని నూతనంగా ఎన్నికైన కో-ఆప్షన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. ప్రజలకు అంకితభావంతో, నిబద్ధతతో పని చేస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్, డీసీసీ ప్రెసిడెంట్ బట్టు కరుణాకర్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.



