తొమ్మిదవ వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేయాలి
తుర్కపల్లి, ఏప్రిల్ 21 జనం సాక్షిసుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం తొమ్మిదో వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు అంబటి చెన్న కిష్టయ్య తెలిపారు.మంగళవారం తుర్కపల్లి మండల కేంద్రంలో గ్రామీణ వైద్యుల సంఘం వార్షికోత్సవ మహాసభ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 28వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా 9వ వార్షికోత్సవ మహాసభను నిర్వహిస్తున్నట్లు జిల్లాకు సంబంధించిన గ్రామీణ వైద్యులు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ,మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి ,జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్, హాజరైతునట్లు గ్రామీణ వైద్యులు అధిక సంఖ్యలో హాజరై మహాసభను విజయవంతం చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కందిగట్ల లక్ష్మయ్య గౌడ్, మండల అధ్యక్షుడు పెండెం రవి, ప్రధాన కార్యదర్శి దుగ్యాల రవికుమార్, మండల ఉపాధ్యక్షుడు కసరబోయిన బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.



