ఖాళీగా ఉన్న సిఏ పోస్టును వెంటనే భర్తీ చేయాలి

 

 

 

 

బిజెపి మండల అధ్యక్షుడు కోడె రమేష్ డిమాండ్

గంభీరావుపేట ఏప్రిల్ 08 (జనం సాక్షి)భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో మండల అధ్యక్షులు కోడె రమేశ్ మాట్లాడుతూ…. నర్మల గ్రామానికి సంబంధించి మహిళా గ్రూపు సిఏ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో రాజీనామా చేసి 4 నెలలు గడుస్తున్న నేటి వరకు కూడా ఉద్యోగం భర్తీ చేయకపోవడం శోచనీయం. కాగా గత.కొన్ని రోజుల క్రితం నియామకానికి తేదీలను ప్రకటించి రద్దు చేయడంతో పలు అనుమానాలకు దారి తీస్తుంది. ఇప్పటి వరకు ఎవరిని నియమించకపోవడం అధికారుల వైఫల్యంగా భావించడమే కాకుండా పలు అనుమానాలకు దారితీస్తుందన్నారు. పరీక్ష నిర్వహించి నేటి వరకు నియమించకపోవడం తో ఎవరి ప్రలోభాలకు తలోగ్గి ఎంపిక రద్దు చేయాల్సి వచ్చిందో సంబంధిత బాధ్యతగల అధికారులు వెంటనే తెలపాలి డిమాండ్ చేశారు. అధికారులు తమ సొంత లాభాలు కోసం అధికార పార్టీ నాయకుల మెప్పుకోసం వారి యొక్క అడుగులకు మడుగులోత్తడానికే జాప్యం చేస్తున్నారన్నారు. సీఏ ఉద్యోగ నియామకంలో అర్హులైన వారిని వెంటనే నియమించాలని లేనియెడల మహిళల ఆఫీస్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మలేష్ యాదవ్ విగ్నేష్ గౌడ్ ఉపాధ్యక్షులు నర్సింలు స్వామి దేవేందర్ యాదవ్ నాయకులు పాల్గొన్నారు

తాజావార్తలు