కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు సస్పెన్షన్
నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 08: (జనం సాక్షి )
మాజీ రాష్ట్ర NSUI ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణు రాజ్, 48వ డివిజన్ మాజీ ప్రెసిడెంట్ పుండ్ర సాయి కుమార్, మాజీ NSUI జిల్లా నాయకులు నరేన్ దీప్ పార్టీ క్రమశిక్షణాలను ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి ఉత్తరువులు జారిచేశారు.ఏఐసిసి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ దీక్ష జరుగుతున్న సమయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి , కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ,రాష్ట్ర విత్తనభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు జీవి రామకృష్ణ , పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ ,రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ , నిజామాబాద్ మేయర్ ఉమారాణి రమేష్ ,కార్పొరేటర్లు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న సమయంలో వరదబట్టు వేణు రాజ్, పుండ్ర సాయికిరణ్, నరేన్ దీప్ మరియు ఇంకొంతమంది వారి వ్యక్తిగత కార్యచరణను దృష్టిలో పెట్టుకొని యువజన కాంగ్రెస్ కార్యక్రమాన్ని అంతరాయం కలిగించే విధంగా అక్కడ ఉన్న నాయకులతో వాగ్వివాదాం పెట్టుకున్న సమయంలో హెచ్చరించిన వినకుండా తాను అనుకున్న కార్యక్రమాన్ని చేసి పార్టీ క్రమశిక్షణాలను ఉల్లంఘించడం జరిగింది.ఇదంతా ఇద్దరు జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర నాయకత్వం ఎదుట ప్రత్యక్షంగా జరగటం వల్ల ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.ఇందుకు గాను పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తూ పార్టీ నుండి బహిష్కరించడం అయినది. ఇప్పటినుండి ఈ ముగ్గురితో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు.


