హిమాచల్ ప్రదేశ్‌లో వరుసగా రెండు భూకంపాలు
ఆగష్టు 12(జనం సాక్షి)హిమాచల్ ప్రదేశ్‌లో బుధవారం తెల్లవారుజామున వరుసగా రెండు భూకంపాలు వణికించాయి. చంబా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున సుమారు 3.27 గంటలకు మొదటి భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.3గా నమోదైంది. భూకంప కేంద్రాన్ని 20 కిలోమీటర్ల లోతులో గుర్తించారు.మొదటి భూకంపం వచ్చిన గంట వ్యవధిలోనే రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. దీని భూకంప కేంద్రాన్ని 10 కి.మీ. లోతులో గుర్తించారు. అయితే వరుసగా రెండు భూకంపాలు రావడంతో చంబా జిల్లాలోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. కాగా ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.