ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులు ఆపాలి : సిపిఐ డిమాండ్
బచ్చన్నపేట మార్చి 18 ( జనం సాక్షి): గత కొన్ని నెలలుగా అమెరికా ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్ పై జరుపుతున్న దాడులను తక్షణమే ఆపాలని సిపిఐ మండల కార్యదర్శి బంటు పాండు అన్నారు. సోమవారం ఆయన సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ మండల మీటింగ్లకు అందరూ హాజరు కావాలని ఆయన అన్నారు.బుట్టెడు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం ఆపాలి ప్రపంచ శాంతిని పరిరక్షించాలి గ్యాస్ పై కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి బ్లాక్ మార్కెట్లను అరికట్టాలి గ్యాస్ పెంచిన డీజిల్ ధరలను పెరుగుదలకు బిజెపి ప్రభుత్వాలు విధానలే కారణం అని సిపిఐ మండల కార్యదర్శి కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు.ఈ కార్యక్రమంలో ఐలయ్య.ఆర్ శాంతయ్య. బాలరాజు. బండి కమలమ్మ. బండారు పద్మ.మొదలవారి పాల్గొన్నారు



