పశువులకుజబ్బ, గొంతువాపు వ్యాధి నివారణ టీకాలు

మల్దకల్ జూన్ జూన్ 9 (జనంసాక్షి): మండల పరిధిలోని పెద్దపల్లి గ్రామంలో ఉచిత గొంతు,జబ్బ వాపు వ్యాధి నివారణ టీకాలు శిబిరం గ్రామ సర్పంచ్ శిరీష రాజశేఖర్ రెడ్డి,డాక్టర్ ఉషతో కలిసి మంగళవారం ప్రారంభించారు.పాల్వాయి పశు వైద్య అధికారిని డా. ఉషమాట్లాడుతూ వర్షాకాలంలో పశువులకు ప్రధానంగా వచ్చేవ్యాధులు గేదెలలో గొంతువాపు గోజాతి పశువులలో జబ్బవాపు గొంతువాపు వ్యాధి ఎక్కువగా గేదెలలో వస్తుందని,ఈ వ్యాధిని గురకవ్యాధి అని కూడా అంటారు,గొంతువాపు వ్యాధి లక్షణాలు 104 -106 జ్వరం,కళ్ళు ఎర్రబడి నీరు కారటం,గొంతు పైభాగాన మెడ కింద వాపు,శ్వాస పీల్చేటప్పుడు పశువులు ఆయాసపడతాయి.జబ్బా వాపు వ్యాధి లక్షణాలు బలంగా ఆరోగ్యంగా ఉన్న గోజాతి పశువులలో ఎక్కువగా వస్తుందని జబ్బా,తొడ కండరాల పైన వాపు కనబడుతుందని, పశుపోషకులుముందస్తు జాగ్రత్తగా వ్యాధి నివారణ టీకాలు వేయించాలి అన్నారు.సర్పంచ్ శిరీష రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పశువులకు వచ్చే సీజనల్ వ్యాధులపై పశు యాజమానూలు అప్రమత్తంగా ఉండి రోగాల భారీ నుండి తమ పశువులను కాపాడుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో 52 గోజాతి పశువులు,20 గేదెలలో టీకాలు వేశారు.ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది మధు,సర్పంచ్ శిరీష రాజశేఖర్ రెడ్డి,ఉపసర్పంచ్ లక్ష్మీనరసింహ,ఓంశంకర్ ఉల్వ నర్సింహా,కుర్వ నర్సింహా, శ్రీశైలం, రమేష్,రంగస్వామి గ్రామస్తులు,పశు పోషకలు పాల్గొన్నారు.