మట్టి రోడ్డుకు మరమ్మత్తులు చేయించిన గ్రామ సర్పంచ్ కోర్ర శిరీష కృష్ణ నాయక్..
తలకొండపల్లి జూన్09(జనంసాక్షి): తలకొండపల్లి మండల పరిధిలోని హర్యనాయక్ తండ పంచాయతీకి చెందిన సూర్య నాయక్ తండా నుంచి పడకల్ బీటి రోడ్డు వరకు ఉన్న సుమారు కిలోమీటర్ దూరం రోడ్డు పూర్తిగా కంకర తేలి గుంతల మయం కావడంతో సర్పంచ్ కోర్ర శిరీష కృష్ణ నాయక్ రోడ్డుపై మొరాన్ని పోయించారు.వర్షాలకు రోడ్డుపై కంకర తేలి,భారీ గుంతలు పడడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.దీంతో గ్రామ ప్రజలు వాహనదారుల విజ్ఞప్తి మేరకు సోమవారం రోడ్డుపై (మొర్రం)మట్టి పోయించారు.కంకర తేలి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో వాహనదారులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.ప్రమాదాలు జరుగకుండా తమవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా హర్య నాయక్ తండా,సూర్య నాయక్ తండా ప్రజలు,నాయకులు,సర్పంచి గారిని పాలకవర్గ సభ్యులను పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్,వార్డు సభ్యులు దశరథం, వెంకటేష్,పంతు,శారద,నాయకులు జె.హర్యా,కర్ణా,పంతు,శంకర్,నవీన్,శివ,తదితరులు పాల్గొన్నారు.



