పోలియో రహిత సమాజంలో భాగస్వాములు కావాలి

ఆర్మూర్ (జనం సాక్షి) : పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆర్ఆర్ ఫౌండేషన్ డైరెక్టర్ సుచరిత రెడ్డి అన్నారు. గురువారం పోలియో డే సందర్భంగా వారు మాట్లాడారు. పోలియో రహిత భారత్ గా 2014లో డబ్ల్యూహెచ్ఓ గుర్తించిందన్నారు.పిల్లల్లో ఆరోగ్యవంతమైన ప్రవర్తనకు, ఐదేళ్ల లోపు చిన్నారులకు తల్లిదండ్రులను ప్రేరేపించేలా పోలియో టీకాలపై అవగాహన పెంపొందించాలన్నారు.