అభివృద్ధిలో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
చౌదర్ పల్లి గ్రామ సర్పంచ్ మేరిగా భారతమ్మ గోపాల్
తలకొండపల్లి జూన్ 7(జనంసాక్షి):ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం మండల పరిధిలోని చౌదర్ పల్లి గ్రామంలో సర్పంచ్ మేరిగా భారతమ్మ గోపాల్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.గ్రామ అభివృద్ధి,వ్యవసాయం,పారిశుద్ధ్యం,విద్య,మౌలిక సదుపాయాలు,ఓటరు జాబితా సవరణలో పారదర్శకత తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభకు స్పెషల్ ఆఫీసర్ ఈసీ కృష్ణ,సర్పంచ్ మేరిగా భారతమ్మ హాజరై ప్రసంగించారు.వాతావరణం శాఖ అంచనాల ప్రకారం ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.వర్షాలు ఆలస్యంగా ప్రారంభమయ్యే పరిస్థితులు ఉన్నందున రైతులు వ్యవసాయ శాఖ సూచనలను మేరకు పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు.వర్షాలు ప్రారంభమైన వెంటనే గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.యూరియా డిఏపి తదితర ఎరువులను ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా మాత్రమే అందజేయనున్నట్లు తెలిపారు.ప్రతి రైతు తప్పకుండా ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు పూర్తి చేసుకోవాలన



