పెద్ద ధన్వాలో రిలే దీక్షలకు తరలొస్తున్న మహిళా రైతులు, కూలీలు

రాజోలి (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేపట్టిన రిలే దీక్షలు సోమవారం నాటికి 12వ రోజుకు చేరాయి. ఫ్యాక్టరీని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించేవరకూ తాము శాంతియుతంగా పోరాడుతామని మరోసారి స్పష్టం చేశారు. ఈ దీక్షలకు విద్యావంతులు, యువకులు, రైతులు, కూలీలతో పాటు వివిధ గ్రామాల నుంచి మహిళలు ప్రతిరోజూ తరలివస్తున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ దీక్షలో ఫ్యాక్టరీ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు.