ఆరోపించారని నిరసనకు దిగిన మహిళా ఎంపీటీసీ
ఆర్మూర్, అక్టోబర్ 16 (జనం సాక్షి): ఆలూర్ మండలం దేగాం గ్రామ మహిళా సంఘం భవనం ఎదుట మాజీ ఎంపీటీసీ సభ్యురాలు మణిదీపిక యాదగిరి బుధవారం టెంట్ వేసుకొని ధర్నా చేశారు.గ్రామంలోని మహిళా సంఘం శిథిలావస్థలో ఉండడంతో తాము చొరవ తీసుకొని ఎంపీ ధర్మపురి అరవింద్ తో మాట్లాడి రూ. 4 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ నిధులతో మహిళా సంఘం భవనానికి మరమ్మత్తులు చేయించిన కొందరు అనవసరంగా ఆరోపణలు చేయడాన్ని నిరసిస్తూ టెంట్ వేసుకొని ధర్నా చేశారు.మంజూరైన నిధులతో టైల్స్ వేసి పిఓపి, తలుపులు, కిటికీలు, జాలి గేట్లు చేయించి రంగులు వేయించినట్లు తెలిపారు.ఈ మరమ్మత్తులో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవని చెప్పారు.మహిళ సంఘాల వారికి సౌకర్యం గా ఉండాలనే ఉద్దేశంతో తానే చొరవ తీసుకొని నిధులు మంజూరు చేయించి పనులు చేయిస్తే కొందరు మహిళా సంఘ సభ్యులు అనవసరంగా ఆరోపణలు చేసినందున నిజనిర్ధారణ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దీక్ష చేపట్టారు.మహిళా సంఘానికి మరమ్మత్తులు చేయించిన ఆరోపణలు చేసిన వారిని గుర్తించి అధికారులు, మహిళలు చర్యలు తీసుకోవాలని కోరారు.