ఆర్టీసీ సమ్మెకు అన్ని పార్టీలను ఏకం చేస్తాం 

share on facebook

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం
– జగిత్యాలలో ఆర్టీసీ డిపోలో కార్మికుల సమ్మెలో పాల్గొని సంఘీభావం
జగిత్యాల బ్యూరో,అక్టోబర్‌ 03(జనంసాక్షి) :   తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. కోదండరాం జగిత్యాల జిల్లా జనసమితి అధ్యక్షులు చుక్క గంగారెడ్డి అధ్యక్షతన 100 మంది కార్యకర్తలతో జగిత్యాలలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఆర్టీసీ కార్మికులకు అండగా నిలుస్తామన్నారు. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికుల త్యాగం వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందన్నారు. దానిని ద షిలో పెట్టుకొని అయినా మన ఆర్టీసీని కావుడుకునేందుకు, ప్రభుత్వంలో వినీలం చేసి నష్టాల పాలు కాకుండా చూస్తూ ముందు తరాల వారికి ఉద్యోగాలు దొరికెందుకు ప్రజలంతా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వైఫల్యం వళ్లనే ఆర్టీసీ నష్టాలకు పోయిందని, డీజల్‌ పన్ను తగ్గిస్తే కొంతమేరకు లాభాలు ఆర్టీసీ కి వచ్చేవని, వందలాది కోట్ల బకాయిలు ప్రభుత్వం చెల్లించకుండా ఉంటే ఇక నష్టం రాధా అని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఈ కార్యక్రమములో జనసమితి నాయకులు చుక్క గంగారెడ్డి, కంతి మోహన్‌ రెడ్డి, నరహరి జగ్గారెడ్డి, ముక్కెర రాజు, వేణుగోపాల్‌, కుమారస్వామి, కంతి రమేష్‌, అళ్ళెంకి శ్రీనివాస్‌, తోడేటి అశోక్‌ గౌడ్‌, కంతి ఆనందం, ఎలుక కమళాకార్‌, గడప చంద్రశేఖర్‌, విజయ్‌, ప్రవీణ్‌ చంద్ర, లక్మి నారాయణ, విజయ్‌ కుమార్‌, రవి, విశాల్‌, పొగుల రాజేశం, కూర్మాచలం ఉమామహేష్‌, గంగాధర్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Other News

Comments are closed.