ఉత్తమ ఎంప్లాయిస్ అవార్డు అందుకున్న నల్లమాస శ్రావణ్ కుమార్

share on facebook

 

కురవి సెప్టెంబర్-24 (జనం సాక్షి న్యూస్)

కురవి మండలం మొగలిచెర్ల గ్రామానికి చెందిన నలమాస లచ్చయ్య కుమారుడు నల్లమాస శ్రావణ్ కుమార్ ఉమ్మడి వరంగల్ జిల్లా బ్రాంచ్ ఇండస్ఇండ్ బ్యాంక్ లో లోన్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నరు. ఉమ్మడి వరంగల్ జిల్లా బ్రాంచ్ లో అత్యధిక లోన్లు చేసినందుకు, తను విధులు నిర్వహించే సంస్థకు అత్యధిక సేవలు అందించినందుకు ఇండస్ఇండ్ బ్యాంక్ ఉత్తమ ఎంప్లాయిస్ అవార్డు గా ఎంపిక చేయడం జరిగిందని నల్లమాస శ్రావణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం వరంగల్ బ్రాంచ్ లో బ్రాంచ్ మేనేజర్ లక్ష్మయ్య, అసిస్టెంట్ మేనేజర్ ఉప్పలయ్య చేతుల మీదుగా ఇండస్ఇండ్ బ్యాంక్ ఉత్తమ ఎంప్లాయిస్ అవార్డును అందుకున్నారు.ఈ సందర్భంగా నల్లమాస శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఉత్తమ ఎంప్లాయిస్ అవార్డు రావడం చాలా గర్వంగా ఉందని అందుకుగాను బ్రాంచ్ మేనేజర్ లక్ష్మయ్య, అసిస్టెంట్ మేనేజర్ ఉప్పలయ్య, ఇండస్ఇండ్ బ్యాంక్ సిబ్బంది లకు,గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Other News

Comments are closed.