ఎర్ర సత్యం సేవలు చిరస్మరణీయం…

share on facebook

సత్యమన్నకు ఘన నివాళులు…
– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి.
ఊరుకొండ, ఆగస్టు 12 (జనం సాక్షి):
బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం దివంగత మాజీ శాసనసభ్యులు ఎర్ర సత్యం చేసిన సేవలు చిరస్మరణీయం అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుడుముల తిరుపతి రెడ్డి, మాదారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డిలు అన్నారు. శుక్రవారం
ఊర్కొండ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో కల్వకుర్తి-జడ్చర్ల ప్రధాన రహదారి పై జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యమన్న
వర్ధంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఎర్ర సత్యం
అన్న జడ్చర్ల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎంతోమంది బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాధారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ రెడ్డి, యువజన విభాగం మండల అధ్యక్షుడు కంఠం విజయుడు, పట్టణ అధ్యక్షుడు అరిఫ్, సేవాదళ్ మండల అధ్యక్షుడు పోలే గణేష్, నాయకులు ఆయుబ్ పాషా, గోపి, మనోహర్ రెడ్డి, షైబాజ్, ఆమేర్, మల్లికార్జున్, వహీద్, దినేష్ రెడ్డి, యాదయ్య, దయాకర్, శ్రీశైలం, గేల్వలయ్య, నాగరాజు, గణేష్, శేరిబాబా, ఖాజా, సూరిగౌడ్, కిష్టయ్య, కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.