ఐదోదశ ఎన్నికలకు ముగిసిన ప్రచారం

share on facebook

6న 51 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌
యూపి బరిలో రాజ్‌నాథ్‌, సోనియా,రాహుల్‌, స్మృతి
న్యూఢిల్లీ,మే4 (జ‌నంసాక్షి):  ఏడు దశల్లో నిర్వహిస్తున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇప్టపికే నాలుగు విడతల ఎన్నికలు ముగిశాయి. ఐదో విడత ఎన్నికల పోలింగ్‌ ఈనెల 6న జరుగనుంది. దీంతో ఈ విడతకు సంబంధించి పార్టీల ప్రచారానికి శనివారం సాయంత్రం తెరపడింది. ఈ విడతలో 7 రాష్ట్రాలు, 51 లోక్‌సభ స్థానాల్లో ఈసీ పోలింగ్‌ నిర్వహిస్తోంది.  51 లోక్‌ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా కీలక నేతలు ఈ దశలో పోటీ పడుతున్నారు. రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ, అమేథీ నుంచి రాహుల్‌ గాంధీలు పోటీచేస్తోండగా, బీజేపీ తరపున కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ అమేథీ నుంచి పోటీలో ఉన్నారు. లక్నో లోక్‌ సభ స్థానానికి కేంద్రమంత్రి రాజ్‌ నాథ్‌సింగ్‌ పోటీపడుతుండగా,ఎస్పీ నుంచి పూనమ్‌ సిన్హా   తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.  జైపూర్‌ రూరల్‌ లోక్‌ సభకు కేంద్రమంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోర్‌ పోటీ చేస్తోండగా, కాంగ్రెస్‌ నుంచి ప్రముఖ క్రీడాకారిణీ కృష్ణ పునియా పోటీ చేస్తున్నారు. అయితే ఐదోవిడతలో దేశవ్యాప్తంగా 674 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 51 లోక్‌ సభ స్థానాల్లో 8 కోట్ల 75 లక్షల 88 వేల 722 మంది ఓటర్లు, 96 వేల 88 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. దేశవ్యాప్తంగా బీహార్‌లోని 5 లోక్‌సభ స్థానాలకు, జమ్మూకశ్మీర్‌ లోని రెండు స్థానాలు, జార్ఖండ్‌ లో నాలుగు స్థానాలు, మధ్యప్రదేశ్‌ లో ఏడు స్థానాలు, రాజస్థాన్‌ లో పన్నెండ్‌ స్థానాలు, ఉత్తరప్రదేశ్‌ లో పధ్నాలుగు లోక్‌ సభ స్థానాలు, పశ్చిమ బెంగాల్‌ లోని ఏడు స్థానాలకు మొత్తం 51 స్థానాలకు ఈసీ ఐదో విడతలో ఎన్నికలు నిర్వహిస్తోంది. బీహార్‌లో సీతామారహీ, మధుబాని, ముజాఫర్‌ పూర్‌, సారన్‌, హాజీపూర్‌లకు, జమ్మూకశ్మీర్‌ లో అనంతనాగ్‌, లడఖ్‌ స్థానాలకు, జార్ఖండ్‌ లో కోదర్‌మా, రాంచీ, ఖుంటి,హజారీబాగ్‌ లకు, మధ్యప్రదేశ్‌ లోని టికామ్‌ ఘర్‌, దోమ్హా, ఖజుర¬, సాత్నా, రేవా, ¬సన్‌ గాబాద్‌, బేతుల్‌ లకు, రాజస్థాన్‌ లోని గంగానగర్‌, బికానేర్‌, చూర్‌, జ్హౌంన్‌జ్హౌను, సికార్‌, జైపూర్‌ రూరల్‌, జైపూర్‌, అళ్వార్‌, భరత్‌ పూర్‌, కౌరాలీధోల్‌ పూర్‌, దౌసా, నాగాఔర్‌ లకు ఎన్నికలు జరుగనున్నాయి. యూపీలో ఇప్పటీకే 39 లోక్‌ సభ స్థానాలకు ఎన్నికలు ముగియగా, ఈ దశలో 14 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఉత్తరప్రదేశ్‌ లోని ధౌవుర్హారా, సీతాపూర్‌, మోహన్‌ లాల్‌ గంజ్‌, లక్నో, రాయ్‌ బరేలీ, అమేథీ, బండా, ఫతేపూర్‌, కౌశంబి, బారాబాంకీ, ్గ/జాబాద్‌, బార్హైచ్‌, కైసర్‌ గంజ్‌, గోండా స్థానాలకు, పశ్చిమ బెంగాల్‌ లోని బన్‌ గాన్‌, బారక్‌ పూర్‌, హౌర్హా, ఉల్బెరియా, శ్రీరాంపూర్‌, హుగ్లీ, ఆరాంబాగ్‌ లకు ఈ దశలోనే పోలింగ్‌ జరునుంది.
జార్ఖండ్‌లో నాలుగు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, 61 మంది అభ్యర్థులు పోటీ
పడుతున్నారు. జమ్మూకశ్మీర్‌ లోని అనంతనాగ్‌ లోక్‌ సభ స్థానంతోపాటు, లడఖ్‌ లోక్‌ సభకు ఐదవ విడతలో పోలింగ్‌ జరుగనుంది. యూపీలో 14 లోక్‌ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, 182 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మధ్యప్రదేశ్‌ లో 7 లోక్‌ సభ స్థానాలకు ఎన్నికలు జరగుతుండగా 110 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఐదవ విడతలో కోటి 19 లక్షల 56 వేల 447 మంది ఓటర్లు, 15 వేల 240 పోలింగ్‌ స్టేషన్లలో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. రాజస్థాన్‌లో 12 లోక్‌సభ స్థానాలకుగాను 134 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు . ఇందులో 16 మంది మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు.  పశ్చిమ బెంగాల్‌లో ఏడు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, 83 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. బీహార్‌ ఐదు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 82 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఐదవ విడత ఎన్నికల ప్రచారం ముగియడంతో ఈసీ ఏర్పాట్లుపై దృష్టిసారించింది. పోలింగ్‌ సందర్భంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకుంటుంది. పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో కేంద్ర బలగాలు పోలింగ్‌ జరుగుతున్న ప్రాంతాల్లో మోహరించాయి. పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాంయంత్రం 6 లకు ముగియనుంది. ఈవీఏంలు, వీవీప్యాట్లను పోలింగ్‌ బూత్‌ లకు పంపించేందుకు చర్యలు చేపట్టింది. ప్రచారం ముగియడంతో ఎన్నికలు జరుగుతున్న లోక్‌ సభ నియోజకవర్గాల పరిధిలో పార్టీలు ప్రచారం నిర్వహించవొద్దని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది.

Other News

Comments are closed.