కళాశాల సమయానికి బస్సులు నడాపాలని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో

share on facebook

 

 

 

 

 

మోత్కూరు డిసెంబర్ జనంసాక్షి : మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మోత్కుర్ లో చదువు కోసం వచ్చే విధ్యార్ధులకు సమాయనికి బస్సులు నడపాలని రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు మందుల సురేష్ మాట్లాడుతూ మోత్కూర్ మండల కేంద్రానికి చదువు కోవడానికి ఆత్మకూరు, గుండాల,అడ్డగూడూరు మండలాల నుండి వందలాది మంది విద్యార్థులు చదువుకోవడానికి ఇక్కడకి వస్తున్నారని వారికి బస్సు సౌకర్యం లేక సమాయనికి రాక విద్యార్థుల తమ చదువులు మధ్యలోనే దూరం చేసుకుంటున్నారని యాదగిరి గుట్ట డీపో మెనెజరు కు చెప్పిన సమస్య పరిష్కారం కాలేదు అని ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తు దృష్తిలొ ఉంచుకొని తక్షణమే సమస్య పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వినోద్,సాయి,షరీఫ్,సందీప్, వేణు,భానుచందర్,కిరణ్,తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.