హైదరాబాద్: హెల్త్‌కేర్‌లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న 3ఎం హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(హెచ్ఐఎస్), ఈసీఎల్ఏటీ హెల్త్ సొలూషన్స్ సంయుక్తంగా తెలంగాణలోని కరీంనగర్లో కొత్త సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశంలో 3ఎం, ఈసీఎల్ఏటీ అధికారులతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌తో ఆ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కరీంనగర్ కేంద్రంలో ఆ సెంటర్ మెడికల్ కోడింగ్, క్లినికల్ డాక్యుమెంటేషన్ సేవల్ని అందించనున్నది. కరీంనగర్లో ఏర్పాటు చేయనున్న ఈసీఎల్ఏటీ ఆపరేషన్స్ సెంటర్లో వంద మందికి ఉద్యోగం కల్పించనున్నారు. ఆ తర్వాత ఆ సెంటర్లో ఉద్యోగుల సంఖ్యను 200కు పెంచనున్నట్లు పేర్కొన్నారు. ఈసీఎల్ఏటీ హెల్త్‌కేర్ సంస్థతో కుదిరిన ఒప్పందం గురించి మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో వెల్లడించారు.
కరీంనగర్లో ఈసీఎల్ఏటీ హెల్త్‌కేర్ సెంటర్: మంత్రి కేటీఆర్
Other News
- ఉపాధి హామీ కూలి మృతికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. కుటుంబాన్ని సందర్శించిన సిపిఐ నాయకులు.
- జనభాగిదారి కార్యక్రమం లో పాల్గొన్న కే.వి ప్రిన్సిపల్ ఆర్.శంకర్
- ప్రతి ఒక్కరూ దైవచించిన తో పాటు సమాజ సేవలో కృషి చేయాలి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
- సీఎం కేసీఆర్ బహిరంగ సభను జయప్రదం చేయండిఅలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం
- ఎన్నికల ముందు ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు ఆపాలి. కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగశిరో
- తెలంగాణ కోటి రతనాల మగనిగా మార్చిన ఘనత కేసీఆర్ దే అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం
- సంగమేశ్వర ఎత్తిపోతల పథకంతో ఆందోల్ సస్యశ్యామలం - మంత్రి హరీష్ రావు
- అలంపూర్ అభివృద్ధి పై బిఆర్ఎస్ నాయకులు చర్చకు సిద్ధమా? బిఎస్పీ జిల్లా అధ్యక్షులు కేశవరావు
- మత్స్య ఉత్పత్తుల ఆహార విక్రయ మేళా(ఫిష్ ఫెస్టివల్) ను జయప్రదం చేయండి.
- పేదోడి బతుకు కోరే ఏకైక పార్టీ సిపిఐ పార్టీ -- జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి