గోదావరి జలాల రాకతో చెరువులకు జలకళ

share on facebook

జనగామ,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  జనగామ ప్రాంతానికి గోదావరి జలాలు చెరువులకు, కుంటలకు
తరలిస్తున్నారు. గోదావరి నీరును విడుదల చేయించిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వానకాలంలో ప్రతీ గ్రామంలోని చెరువులను గోదావరి నీటితో నింపుతుండటంతోపాటు కాలువల వెంట కలియ తిరుగుతూ బొమ్మకూర్‌ రిజర్వాయర్‌ నుంచి గోదావరి నీటిని జనగామ మండలంలోని అడవికేశ్వాపూర్‌, వెంకిర్యాల, గోపరాజుపల్లి, పెద్దపహాడ్‌, ఓబుల్‌కేశ్వాపూర్‌, పసరమడ్ల, పెద్దరాంచర్ల, సి/-దదెంకి, ఎల్లంల, పెంబర్తి గ్రామాల చెరువులు, కుంటలకు నీటిని విడుదల చేయించారు. గోదావరి నీరు గ్రామాలకు చేరుకోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  వేసవి వచ్చిందంటే తాగు, సాగునీటికి తల్లడిల్లే కరువు నేల జనగామ ప్రాంతం నేడు గోదావరి జలాలతో కళకళలాడుతున్నది. గత ప్రభుత్వాలు చెరువులు, కుంటలను పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లోని గొలుసుకట్టు చెరువులకు జీవం పోస్తున్నది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా కేసీఆర్‌ ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పథకం చేపట్టి మండలంలోని ప్రతీ గ్రామంలోని చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు చేపట్టి, వాటిని గోదావరి జలాలతో నింపుతున్నారు. ఈ క్రమంలో కరువు గడ్డ అయిన మండలంలోని వెంకిర్యాల, చౌదర్‌పల్లి చెరువులు నిండి అలుగు పోస్తుండడంతో సి/-దదెంకి, ఎల్లంల, పెంబర్తి గ్రామాలకు గోదావరి జలాలు పరుగులు పెడుతున్నాయి. ఈగ్రామాల చెరువులు నిండగానే మిగితా గ్రామాల చెరువులను నింపుకుంటారని, కరువు నెలకు గోదావరి నీరు తీసుకురావడం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికే దక్కుతుందని రైతులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Other News

Comments are closed.