ఘనంగా కాళోజి జయంతి వేడుకలు

share on facebook

మహబూబాబాద్‌,సెప్టెంబర్‌9 : మహబూబాబాద్‌ జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాకవి కాళోజి 105వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఏఆర్‌ డీఎస్పీ రెలా జనార్దన్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణయాస, భాషా పరిరక్షణకు కృషి చేయడంతో పాటు, తన కవితల ద్వారా ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడు కాళోజీ నారాయణరావు. వారి రచనల స్ఫూర్తి ఉద్యమానికి మరింత బలాన్ని, చైతన్యం నింపింది. తెలంగాణ భాషకి తగిన గుర్తింపు కోసం తన రచనల ద్వారా ప్రజల్లోకి
చురుగ్గా పంపగలిగారు. వారి ఆశయ సాధన కు ప్రతి ఒకరు కృషి చేయాలని తెలిపారు.
ప్రజాకవి కాళోజీ చిత్రపటానికి పుల మాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ రెలా జనార్దన్‌ రెడ్డి, ఆర్‌ఐ నరసయ్య, ఆర్‌ఐ పూర్ణచందర్‌, ఎస్బి ఇన్స్పెక్టర్‌ తిరుపతి , డీసీఆర్బీ సీఐ రమేష్‌, మిగితా అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Other News

Comments are closed.