ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు

share on facebook

నర్సాపూర్ , సెప్టెంబర్ 23, ( జనం సాక్షి )
నర్సాపూర్ పట్టణంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక అక్షర ప్లానెట్ పాఠశాలలో శుక్రవారం నాడు బతుకమ్మ సంబరాలను పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా తయారు చేశారు.
పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులతో పాటు చిన్నారులు, విద్యార్థినిలు బతుకమ్మ ఆడారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు ఆడిన కోలాటము ఆట ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ ఎన్ అశోక్ కుమార్ ,వెంకట్ రెడ్డి, స్కూల్ ప్రిన్సిపల్ రాసి, ఏఓ సుమిత్ర, స్రవంతి, సరిత, మౌనిక, దివ్యరాణి, చిత్రా, సంగీత ,చంద్రిక ,సాయి, సిరి, శిల్పా ,షీలా, బేబీ, రాణి, సౌజన్య, శాలిని ,హనుమంతు, నరేష్, కృష్ణ ,శ్రీలత, గాయత్రి టీచర్స్ బృందం పాల్గొన్నారు.

Other News

Comments are closed.