జిల్లా పోలీసుల తీరు దారుణం

share on facebook

మండిపడ్డ ఎంపి ధర్మపురి అర్వింద్‌

నిజామాబాద్‌,నవంబర్‌11( జనం సాక్షి ): జవాన్‌ మహేష్‌ త్యాగం వృథా కాదని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. జిల్లాలో పోలీసుల పనితీరు బాగాలేదని విమర్శించారు. న్యావనందిలో మహిళ హత్యపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హత్యలు, భూకబ్జాలు చేస్తున్నవారిపై చర్యలు లేవన్నారు. హత్య జరిగి నెల గడిచినా ఇంకా నిందితులును పట్టుకోలేదని మండిపడ్డారు. దుబ్బాక ఎన్నికల్లో రైతులంతా బీజేపీకే ఓటేశారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూరల్‌ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్‌ అరాచకాలు ఎక్కువయ్యాయని చెప్పారు. కబ్జాలు, సెటిల్‌మెంట్లు, హత్యలను ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.

Other News

Comments are closed.