టిఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం: మంత్రి

share on facebook

రంగారెడ్డి,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా టిఆర్‌ఎస్‌ విజయాన్ని ఆపలేరని మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు. మహాకూటమితో ప్రజలకు ఓరిగేదేవిూ లేదన్నారు. టిఆర్‌ఎస్‌ అభివృద్ది చేసే పార్టీ అన్నారు. ప్రజల సంక్షేమం కెసిఆర్‌తోనే సాధ్యమని అన్నారు. వివిధ పార్టీల నాయకులు మంత్రి సమక్షంలో గులాబీ కండువాలు వేసుకున్నారు. ఈ సందర్భంగామంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకపోతున్న కాంగ్రెస్‌ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అన్నివర్గాల ప్రజలకు లబ్ధి చేకూరిందని స్పష్టంచేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేసిందని చెప్పారు. టీఆర్‌ఎస్‌ పథకాలే తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ పార్టీ కేవలం ఉనికి కోసం పాకులాడుతోందని ఎద్దేవాచేశారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ టీఆర్‌ఎస్‌ జెండా ఎగరవేస్తామని తెలిపారు.

 

Other News

Comments are closed.