దీక్షిత్‌ కుటుంబాన్ని పరామర్శించిన విరాహత్‌

share on facebook

-కరోనాతో తల్లిని కోల్పోయిన జర్నలిస్టు పరామర్శ

-మంత్రి,ఎస్‌పిలతో సమావేశం

హైదరాబాద్‌,అక్టోబరు 23(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్‌ అలీ ఇవ్వాళ మహబుబాబాద్‌ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. కిడ్నాప్‌ కు గురై కిరాతకుల చేతిలో హత్యకు గురైన బాలుడు, జర్నలిస్టు రంజిత్‌ రెడ్డి కుమారుడు దీక్షిత్‌ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం జిల్లా ఎస్‌.పి కోటిరెడ్డిని కలిసి చిన్నారి హత్యోదంతంపై సమగ్ర విచారణ జరిపి దుండగులందరిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. ఇదే విషయమై మంత్రి సత్యవతి రాథోడ్‌ ను కలిసి విజ్ఞప్తి చేసారు. అనంతరం డోర్నకల్‌ నియోజకవర్గంలోని మరిపెడ ను సందర్శించి ఇటీవల కరోనాతో తల్లిని కోల్పోయిన సీనియర్‌ జర్నలిస్ట్‌ శ్రీనివాస్‌ ను పరామర్శించి ఓదార్చారు. ఈ పర్యటనలో విరాహత్‌ తో పాటు టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గాడిపల్లి మధు గౌడ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేష్‌, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చిత్తనూరి శ్రీనివాస్‌, యుగంధర్‌, జాతీయ కౌన్సిల్‌ సభ్యులు దూలం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.