నీటి పొదుపును అలవర్చు కోవాలి: ఎమ్మెల్యే

share on facebook

గద్వాల,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  నీటిని పొదుపుగా వాడుకుంటే ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించ వచ్చని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. చెరువులు, కుంటల కింద చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేవిధంగా కృషిచేస్తున్నట్లు వెల్లడించారు. ర్యాలంపాడు రిజర్వాయర్‌లో నీటి నిల్వ 3.9 టీఎంసీలు చేరుకోవడంతో ఎమ్మెల్యే బండ్ల ఆనందం వ్యక్తంచేశారు.  ర్యాలంపాడు కింద ఉన్న కాలువలు, చెరువులు, కుంటల కింద వానాకాలంలో పైర్లు సాగుచేసుకోవడానికి ఇక ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేశారు. అయితే సాగునీటిని వృథా చేస్తున్నారని, ఈ పద్ధతిని మానుకోవాలని హితవు పలికారు. రువు పరిస్థితుల్లో జూరాలకు స మృద్ధికి నీరు చేరడం రైతాంగం చేసుకున్న అదృష్టమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు సాగునీటిని సద్వినియోగం చేసుకుని వానాకాలం లో మంచిగా పంటలు పండించుకుని సుఖ సంతోషాలతో గడపాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని ప్రజలు సద్విని యోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సూచించారు.  ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమ కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు.ప్రజలు రోగాల బారిన పడి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న వారికి సీఎం రీలీఫ్‌ ఫండ్‌ ద్వారా చేయూత నిస్తుందని చెప్పారు.

Other News

Comments are closed.