నీటి సంరక్షణ చర్యలు తప్పనిసరి

share on facebook

లేకుంటే భవిష్యత్‌ అంధకారమే

నల్లగొండ,మే30(జ‌నంసాక్షి): ముందు తరాలకు నీటి సమస్యను తొలగించాలంటే జల సంరక్షణను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని గ్రావిూణాభివృద్ధి శాఖ అధికారులు సూచించారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలో 1300 మంది జనాభా కలిగిన హివారే గ్రామంలో నీటి సమస్యను ఆ గ్రామ ప్రజలు నీటి యజమాన్య పద్ధతులు పాటించి నీటి సంరక్షణ పద్ధతుల్లో సంపన్న గ్రామంగా మారిందని వివరించారు. సుస్థిర వ్యవసాయానికి తేమ సంరక్షణ ముఖ్యమన్నారు. పొలంగట్లు, కాల్వలను క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయడం వల్ల ఉపరితలంలో నీటి నిల్వలు పెంచవచ్చని తెలిపారు. రబీలో వరి పంటలు సాగు చేయలేని పరిస్థితి నెలకొందని, భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా ప్రతీ ఇంట్లో ఇంకుడు గుంతలు ఉండాలని, రైతులు తమ వ్యవసాయ భూమిలో గల్లీ పగ్‌లు, కందకాలు, చెక్‌డ్యాంలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నీటి వినియోగం పెరగటం, భూగర్భ జలాలు తగ్గటం వల్ల నీటి సమస్య నివారణకు నాబార్డు ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందన్నారు. ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను అప్రమతత్త చేస్తున్నామన్నారు. గతంలో అడువులు ఎక్కువగా ఉన్న సమయంలో వర్షపాతం పెరిగిందని, ప్రస్తుతం అడువులు అంతరించడం వల్ల వర్షపాత శాతం తగ్గిందన్నారు. బ్యాంక్‌ల్లోడబ్బు దాచుకున్నట్లే, నీటిని కూడా ఆదా చేయాలని సూచించారు.

Other News

Comments are closed.