పలు అభివృద్ది పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

share on facebook

రాజన్నసిరిసిల్ల : జిల్లా పర్యాటనలో భాగంగా ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గంభీరావుపేట మండలం కొల్లమద్ది గ్రామంలో జలహిత అప్పర్ మానేరు ఫీడర్ ఛానెల్ లో ఉపాధి హామీ పథకం ద్వారా పూడిక తీత పనులను మంత్రి ప్రారంభించారు. 8 కోట్ల 40 లక్షల రూపాయలతో మండలంలోని నర్మాల గ్రామంలో మానేరు వాగుపై నిర్మించనున్న రెండు చెక్ డ్యామ్ ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 33/11 కేవీ సబ్ స్టేషన్ ను  ప్రారంభించారు. అలాగే నర్మాల రైతువేదిక నిర్మాణానికి భూమిపూజ  అనంతరం మధ్యాహ్నం సిరిసిల్ల పట్టణంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రి హాజరు కానున్నారు.

Other News

Comments are closed.