పశుగ్రాస కేంద్రాలను గుర్తించాలి

share on facebook

మహబూబ్‌నగర్‌,మార్చి29(జ‌నంసాక్షి): గతంలో కంటే ప్రతి ఏడాదికి గొర్రెలు అధికంగా అవుతున్నందున ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా పశుగ్రాసాలు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అధికారులు  స్పష్టం చేశారు.  గొర్రెల పెంపకం సంబంధించిన భూమి, పశుగ్రాసం పెంచే భూమి, నీటి పరివాహక ప్రాంతాలను గుర్తించి పశుగ్రాసం పెంచాలన్నారు. పశుగ్రాసానికి సంబంధించిన విత్తనాలను 75
సబ్సిడీతో ప్రభుత్వం అందించడం జరుగుతుందని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పశుగ్రాసం పెంచేందుకు అనువుగా ఉన్న చెరువులను గుర్తించి స్వయం సహాయక బృందాలను కలుపుకుంటు ముందుకు సాగాలని సూచించారు. ఎక్కడ పశుగ్రాసం సమస్యలు ఉన్నాయో గుర్తించాలన్నారు. గొర్రెలలో వచ్చే వ్యాధులు గుర్తించి సకాలంలో వైద్యం అందే విధంగా వెటర్నరీ సిబ్బంది, సిద్ధం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంచార పశువైద్య శాలలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. పూర్తిస్థాయిలో గొర్రెల యూనిట్లను లబ్ధిదారులకు అం అవసరమై ప్రణాళికలు రూపొందించుకుంటు ముందుకు సాగాలని సూచించారు.

Other News

Comments are closed.