పార్టీ మారే స్వేచ్ఛ అందరికీ ఉంది

share on facebook

వ్యాపారాల కోసమే అయితే టిఆర్‌ఎస్‌లో చేరేవాడిని
కెసిఆర్‌ కుటుంబ పాలన అంతానికే బిజెపిలో చేరుతున్నా
అవినీతి పాలన అంతమొందించడం బిజెపికే సాధ్యం
జెపి నడ్డాతో భేటీ అనంతరం రాజగోపాల్‌ రెడ్డి వెల్లడి

న్యూఢల్లీి,అగస్ట్‌6( జనం సాక్షి): రాష్ట్రంలో అవినీతి కుటుంబ పాలన పోవాలంటే బీజేపీతోనే సాధ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణలో కెసిఆర్‌ కుటుంబ పాలనపై పోరాడేందుకే తాను కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చిందని మరోమారు ఆయన స్పష్టం చేశారు. శనివారం ఆయన ఢల్లీిలో వివేక్‌ బీజేపీ నేత వివేక్‌ వెంకటస్వామితో కలిసి జెపి నడ్డాను కలిశారు. ఈ నెల 21న అధికారంగా బీజేపీలో చేరుతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన ఢల్లీిలో బీజేపీ చీఫ్‌ నడ్డాతో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్‌లను కలిశారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ, మునుగోడులో బహిరంగసభ ఉండే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాటం చేశానన్నారు. ఉప ఎన్నిక అంటేనే రోడ్లు వేయిస్తున్నారని తెలిపారు. టిఆర్‌ఎస్‌ పార్టీలోకి గతంలో 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వెళ్లారని.. ఆ రోజు కాంగ్రెస్‌ నాయకులు ఏం మాట్లడలేదన్నారు. మార్టీ మారే స్వేచ్ఛ అందరికీ ఉందన్న రాజగోపాల్‌ రెడ్డి.. నైతికంగా రాజీనామ చేసి పార్టీ మారాను .. ఇది తప్పా? అన్నారు. మునుగోడు ఉప ఎన్నికను తెరపైకి తెచ్చింది టీఆర్‌ఎస్‌ పార్టీయే అని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఏనాడూ అపాయింట్‌ మెంట్‌ ఇవ్వరన్న ఆయన.. మంత్రులు కూడా అపాయింట్‌ మెంట్‌ ఇవ్వరు.. ప్రజా సమస్యలు వినరు అని తెలిపారు. ఎమ్మెల్యే చేయాల్సిన పనులు కూడా చేయనివ్వలేదని.. ప్రొటోకాల్‌ ఎక్కడా ఫాలో అవ్వలేదన్నారు. చౌటుప్పల్‌ లో సమావేశం ఏ తరహాల్‌ పెట్టాలో నిర్ణయిస్తామని.. మూడున్నరేళ్లుగా ప్రజా సమస్యలపై ఎలా పోరాటం చేశానో ప్రజలు చూశారని చెప్పారు. అమిత్‌ షాను కలవగానే గట్టుపల్లిని మండలంగా మార్చారని.. వ్యాపారాలు, కాంట్రాక్టులు, డబ్బులే ముఖ్యమంటే టీఆర్‌ఎస్‌ లోనే చేరేవాళ్లమని తేల్చి చెప్పారు. టీఆర్‌ఎస్‌ లో చేరాలని గతంలోనే ఆహ్వానం అందిందని.. కానీ ఆ పార్టీ అంటే నాకు ఇష్టం లేదన్నారు. తెలంగాణ కోసం వెంకట్‌ రెడ్డి మంత్రి పదవి త్యాగం చేశారని .. వెంకట్‌ రెడ్డి గురించి అద్దంకి దయాకర్‌ దారుణంగా మాట్లాడారన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారిని గాలికొదిలేశారన్న రాజగోపాల్‌ రెడ్డి.. రేవంత్‌ రెడ్డి రాష్ట్ర సాధనలో జైలుకి వెళ్లారా.. ఓటుకు నోటు కేసులో వెళ్లారా అనేది ప్రజలందరికీ తెలుసన్నారు. నాపై ఒక్క కేసు కూడా లేదని.. మమ్మల్ని కోమటిరెడ్డి బ్రదర్స్‌ గానే గుర్తిస్తారని.. మమ్మల్ని వాడుకుని సీఎం అవ్వాలన్న రేవంత్‌ ప్లాన్‌ పారలేదని తెలిపారు. రేవంత్‌ .. ఆయన సైన్యం దొంగల ముఠాగా మారి మాపై నిందలు వేస్తున్నారని తెలిపారు. ఇది ధర్మయుద్ధం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నిక అని రాజగోపాల్‌ రెడ్డి తెలిపారు. రేవంత్‌ వచ్చాక కాంగ్రెస్‌ మరింత పతనమయ్యిదని చెప్పారు. మొత్తంగా నల్లగొండ రాజకీయ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఢల్లీిలో తెలంగాణ రాజకీయాలను వేడి పుట్టించారు. శుక్రవారం మధ్యాహ్నాం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో కోమటిరెడ్డి బ్రదర్స్‌ భేటీ అయ్యారు. అయితే విడివిడిగానే.. ముందుగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. అమిత్‌ షాను కలిశారు. బీజేపీలో చేరిక, మునుగోడు బహిరంగ సభపై చర్చించినట్లు తెలుస్తోంది. అధికారికంగా
మునుగోడు సభలోనే చేరతారనే సంకేతాలు అందుతున్నాయి. ఈ మేరకు భేటీ వివరాలను ఆయన విూడియాకు వెల్లడిరచారు. ఈ నెల 21న అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరుతానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తెలిపారు. వెంటనే శనివారం నడ్డాతో భేటీ అయ్యారు. తనతో పాటు బీజేపీలో చాలామంది చేరుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉపఎన్నిక వస్తేనే నిధులు వచ్చే పరిస్థితి ఉందని.. కేసీఆర్‌కు కనువిప్పు కలిగేలా మునుగోడు తీర్పు ఉంటుందన్నారు. అభివృద్దికి అధికార పార్టీ సహకరించడం లేదన్న ఆయన..అభివృద్ధి సిద్ధిపేట, సిరిసిల్లలకే పరిమితమైందని ఆరోపించారు. తెలంగాణ ఆకాంక్షలను తుంగలో తొక్కారని అన్నారు. ఇచ్చిన హావిూలు అమలు చేయడం లేదన్నారు. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రైతు రుణమాఫీని అటకెక్కించారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు తెస్తుందని..మునుగోడు ప్రజలు ధర్మం వైపు ఉంటారన్న నమ్మకం తనకు ఉందన్నారు. అలాగే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కూడా త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటారని రాజగోపాల్‌ రెడ్డి తెలిపారు. చెరుకు సుధాకర్‌ చేరిక పట్ల వెంకట్‌ రెడ్డి అసతృప్తితో ఉన్నట్లు చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు తగిన గుర్తింపు లేదని..తమకు పదవులు ముఖ్యం కాదని..ప్రజాసమస్యల పరిష్కారమే ప్రధానమన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ పేరు ప్రతిష్ఠలను చూసి కొందరు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందని రాజగోపాల్‌ రెడ్డి ఆరోపించారు. బయటనుంచి వచ్చిన వ్యక్తికి పీసీసీ చీఫ్‌ పదవి కట్టబెట్టారని..ఆయనను ముఖ్యమంత్రి చేయడానికి మేము కష్టపడాలా అని ప్రశ్నించారు. తాను బీజేపీకి అమ్ముడుపోయినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్తున్నా.. ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరిస్తున్నా.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారడం మోసం చేయడమా? మునుగోడు అభివృద్ధికి సొంత నిధులు ఖర్చు చేశా. నా రాజీనామాతోనైనా ముఖ్యమంత్రి కళ్లు తెరవాలి. మునుగోడులో సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని రాజగోపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై చిల్లర గ్యాంగ్‌లు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాయి. దుర్మార్గుడి చేతుల్లోకి కాంగ్రెస్‌ వెళ్లింది. రేవంత్‌, ఆయన సైన్యం దొంగల ముఠాగా ఏర్పడిరది.కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ఎలాంటి అవినీతి లేదు. రేవంత్‌ స్వార్థం కోసం, పదవుల కోసం కాంగ్రెస్‌లో చేరాడు. డబ్బులు ఇచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్న చరిత్ర రేవంత్‌దని రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు.

Other News

Comments are closed.