ఫ్రీడమ్ ర్యాలీలో పాల్గొన్న అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం,వడ్డేపల్లి జెడ్పిటిసి కాశపోగు రాజు

share on facebook

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 13 (జనం సాక్షి);
75 వ భారత స్వతంత్ర వజ్రోత్సవల్లో భాగంగా పెద్ద ఎత్తున ఫ్రీడమ్ ర్యాలీ శనివారము వడ్డేపల్లి మున్సిపాలిటీలోని శాంతినగర్ పట్టణం లో డిగ్రీ కాలేజ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ లో అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.
అబ్రహం,వడ్డేపల్లి జెడ్పిటిసి కాశపోగు రాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ
75 వ స్వాతంత్ర వజ్రోత్సవలు ప్రభుత్వము ఇలా ఘనంగా నిర్వహించి దేశ భక్తిని ప్రజల్లోకి తీసుకెళుతు రాష్ట్ర ప్రజలను ఏక తాటి మీదకుతీసుకవస్తున్న
సీఎం కేసీఆర్ కి ముందుగా హృదయ పూర్వక ధన్యవాదాలు అన్నారు.
ప్రభుత్వం ఈ సహస్రాబ్ది వజ్రోత్సవ వేడుకలు నిర్వహించి ప్రజల్లో దేశ భక్తి పెంపొందించి నాటి ఫ్రీడమ్ ఫైటర్ ల పోరాట పటిమ నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని, బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించి భారతీయులను ఎన్నో చిత్ర హింసలకు గురి చేశారనీ, వారు ఆనాడు పడ్డ బాధలు నేటి యువత వారి చరిత్రను తెలుసుకోవాలనీ,
తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాలు జరిపి తెలంగాణ ఎలాగ తెచ్చాడో అదే విధంగా ఎందరో మహానియులు జరిపిన పోరాట పటిమతో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందనీ,లాల లజపతి రాయ్,బిపిను చంద్ర పాల్, బాల గంగాధర తిలక్, భగత్ సింగ్, గాంధీ, నెహ్రు, సుభాష్ చంద్ర బోస్, డా, బీఆర్ అంబెడ్కర్, ఇలా ఎందరో దేశ భక్తులు తమ ప్రాణాలను గాలికి వదిలి బ్రిటిష్ తూటాలకు అడ్డుగా నిలబడి మనకు స్వాతంత్ర్యం తేవడంలో ఇలాంటి వారు కీలక పాత్ర పోషించారని,సీఎం కేసీఆర్ తెలంగాణ గురించి కొట్లాడి ఉండక పోతే ఇప్పుడు మనకు ఈ రాష్ట్రము ఉండేది కాదనీ,సీఎం కేసీఆర్ పోరాటము ఎలా చేసాడో,కానీ ఆనాటి వీరుల పోరాట పటిమ ఇప్పుడు ఉన్న యువత చూడలేకపోయారనీ, కేవలం పుస్తకాల్లో,సినిమాల్లో చూస్తున్నారనీ,భవిష్యత్ లో స్వాతంత్ర్య ఉద్యమ పోరాట వీరుల చరిత్ర అందరికి తెలిసేలా అందరి గురించి పొందుపరచాలనీ,ప్రజలు తమ ఇండ్ల పై జెండలు పెట్టి తమ దేశభక్తినిచాటుతున్నారు.ఇల
ఎప్పుడు జరగలేదనీ,
ఒకప్పుడు ఓట్ల సమయంలో జెండలు కట్టేవారనీ, కానీ పార్టీలు లేవు ఏమి లేవు ఒకటే మతం ఒకటే కులం భారత దేశం అనే భావన ప్రజల్లో వచ్చిందనీ, అధికారులు గత కొన్ని రోజులుగా వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొని అందరూ పాల్గొనేలా చేస్తూ ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రములో వజ్రోత్సవ వేళా ప్రతి కార్యాలయం విద్యుత్ దీపాల కాంతులతోవెలిగిపోతున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, యువకులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.