బాలచందర్‌ విగ్రహావిష్కరణలో రజనీకాంత్‌, కమల్‌

share on facebook

చెన్నై,నవంబర్‌8 (జనంసాక్షి) :   చెన్నైలోని రాజ్‌ కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ ఆఫీస్‌ పరిధిలో బాలచందర్‌ విగ్రహాన్ని కమల్‌, రజనీకాంత్‌ కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో రజనీకాంత్‌ మాట్లాడుతూ.. రాజకీయాలలోకి వచ్చిన కమల్‌ సినిమాని ఏ నాడు మరవలేదు. తన ప్రతిభని చూపిస్తూనే ఉన్నాడు అని చెప్పుకొచ్చారు. గురువారం కమల్‌ హాసన్‌ బర్త్‌డే కావడంతో ఆయన పుట్టిన రోజు వేడుకలతో పాటు 60 ఏళ్ళసినీ ప్రస్థానానికి జ్ఞాపకంగా మూడు రోజుల వేడుక నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా కమల్‌ తన తండ్రి శ్రీనివాసన్‌ విగ్రహాన్ని పరమక్కుడిలో ఆవిష్కరించారు. ఇవాళ చెన్నైలోతన
సినీ గురువు కె. బాలచందర్‌ విగ్రహావిష్కరణ చేసారు కమల్‌. ప్రస్తుతం కమల్‌ భారతీయుడు 2 చిత్రంతో బిజీగా ఉండగా, రజనీకాంత్‌ దర్భార్‌ చిత్రం చేస్తున్నారు.

Other News

Comments are closed.