మళ్లీ సిఎంగా కెసిఆర్‌ రావడం ఖాయం

share on facebook

పలువురు టిఆర్‌ఎస్‌లోకి చేరిక
కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి మహేందర్‌ రెడ్డి
రంగారెడ్డి,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడం ఖాయమని  రవాణాశాఖ మంత్రి పట్నం మహేంద ర్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ అభివృద్ధికి కృషి చేస్తున్నదని, కాంగ్రెస్‌ నాయకులు అభివృద్ధిని చూడలేక పోతున్నారని మంత్రి దుయ్యబట్టారు.  మిషన్‌ భగీరథ కార్యక్రమం ద్వారా తాగు నీటిని ఇంటింటికి అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. మంత్రి మహేందర్‌ రెడ్డి సమక్షంలో షాబాద్‌ మండలానికి చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు కౌకుంట్ల రాజేందర్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాడు. జిల్లా టీఆర్‌ఎస్‌ యువజన విభాగం అధ్యక్షుడు అవినాష్‌ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి మహేందర్‌ రెడ్డి కౌకుంట్లకు టీఆర్‌ఎస్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ
గత నాలుగున్నర సంవత్సరాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ. వేల కోట్ల నిధులతో రోడ్లను, ఇతర రకాల అభివృద్ధి పనులను అమలు చేశామని తెలిపారు. అయితే కాంగ్రెస్‌ నాయకులకు అభివృద్ధి కనబడడం లేదని, వారు సామాజిక మాధ్యమాల ద్వారా టీఆర్‌ఎస్‌పై దుష్పచ్రారం చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ప్రజలు టీఆర్‌ఎస్‌ పక్షాన్నే ఉన్నారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన హావిూ ప్రకారం పేదలకు ఆసరా పింఛన్లు ఇచ్చిన కేసీఆర్‌ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ప్రజలు ఆశీర్వదిస్తే ఇప్పుడు ఇస్తున్న పింఛన్లు రెట్టింపు చేస్తానని మేనిఫెస్టోలో హావిూ ఇచ్చారని గుర్తు చేశారు. దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్‌ పేదలు, వికలాంగులు, రైతుల కోసం వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు అవసరమైన పథకాలు అమలు చేస్తున్నారన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రచారం కోసం ఎక్కడికి వెళ్‌ల్లినా ప్రజలు తాము కారు గుర్తుకే ఓటు వేస్తామని, కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా చేస్తామని ప్రజలు చెబుతున్నారని మంత్రి పేర్కొన్నారు.

Other News

Comments are closed.