రైల్వేస్టేషన్‌ రోడ్డులో ప్రమాదం

share on facebook

శరణ్య ¬టల్‌లో రాజుకున్న మంటలు
వరంగల్‌,జూన్‌7(జ‌నంసాక్షి): వరంగల్‌ రైల్వే స్టేషన్‌ రోడ్డులోని శరణ్య¬టల్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 9.45గంటల సమయంలో ¬టల్‌లోని మొదటి అంతస్తులో ఉన్న బోరు మోటారులో విద్యుత్‌ షాట్‌సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మోటారు పక్కనే ఉన్న ఫర్నీచర్‌ అంటుకొని దట్టమైన పొగలు వ్యాపించాయి.
గమనించిన ట్రాఫిక్‌ పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు గంటన్నరపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రధాన రోడ్డులో ప్రమాదం సంభవించిడంతో ట్రాఫిక్‌ను వేరే మార్గంలో మళ్లించినట్లు పోలీసులు తెలిపారు. సకాలంలో స్పందించకపోతే పక్కనే ఉన్న జీఆర్‌గుట్ట 33కేవీ సబ్‌ స్టేషన్‌ అంటుకొని పెద్దప్రమాదమే జరిగేదని పోలీసులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో ఆస్తినష్టం తప్ప ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Other News

Comments are closed.