*వృద్ధాశ్రమంలో జాతీయ జెండాల పంపిణీ*

share on facebook

మునగాల, ఆగష్టు 13(జనంసాక్షి): భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు మండలంలోని ముకుందాపురం గ్రామ శివారులో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు మునగాల మండల ప్రఖ్యాత సామాజిక ఉద్యమకారుడు వేమూరి సత్యనారాయణ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు శనివారం జాతీయ జెండాల పంపిణీ చేశారు. అంతేగాక వారికి జాతీయ జెండా ప్రాముఖ్యతను మరియు జాతీయ జెండా ప్రాముఖ్యతను, స్వాతంత్ర సమరంలో జరిగిన యదార్థ సంఘటనలను వారికి వివరించారు. వృద్ధాశ్రమంలోని యాజమాన్యానికి జాతీయ జెండాను కట్టి దేశ గౌరవాన్ని పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ నిర్వాహకురాలు విజయమ్మ, కోదాడ నియోజకవర్గ టిఆర్ఎస్వి అధ్యక్షుడు పాషా, ఖానాపురం సర్పంచ్ గన్నలగడ్డ శ్రీనివాసరావు, అనంతగిరి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గింజుపల్లి రమేష్, నీలమ్మ, జయమ్మ, రమణ తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.