సడక్ బందు సన్నాహాలు

share on facebook

మద్దతు తెలిపిన ప్రతిపక్ష పార్టీలు

45వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె

దీక్ష విరమించిన అశ్వత్థామరెడ్డి

హైదరాబాద్, నవంబర్ 18(జనంసాక్షి): తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చేపట్టిన సమ్మె 45వ రోజుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు ఎక్కడికక్కడ ఆందోళనలు, నిరసనలు తెలియజేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండను విరమించుకున్నా.. సీఎం కేసీఆర్ మాత్రం చర్చలకు పిలవకుండా నిరంకుశపాలనను సాగిస్తున్నాడని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కార్మికులు తెరాస ముఖ్యనేతలను, ఎమ్మెల్యేలు, మంత్రులను అడ్డుకుంటున్నారు. ఇందులో భాగంగా కొప్పుల ఈశ్వరను కార్మికులు అడ్డుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయనను ఉస్మానియాకు తరలించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన చికిత్సకు నిరాకరించడంతో ఆరోగ్యం క్షీణించినట్టు వైద్యులు తెలిపారు. అశ్వత్థామరెడ్డిని ఐసీయూలో చేర్పించారు. అశ్వత్థామను పలువురు రాజకీయ, ఆర్టీసీ ఐకాస నేతలు పరామర్శించారు. సోమవారం ఉదయం తెజస అధ్యక్షుడు కోదండరామ్ అశ్వత్థామరెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాగే దీక్ష కొనసాగిస్తే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులుచెప్పారని, అశ్వత్థామరెడ్డికి బీపీ, షుగర్ ఉండడం వల్ల కీటోన్స్ ఉత్పత్తి అవుతాయనీమూత్రపిండాలపై ప్రభావం చూపుతాయని వైద్యులు పేర్కొన్నట్లు తెలిపారని కోదండరాం ఆయనకు బలవంతంగా సెలైన్స్ ఎక్కిస్తున్నారని, అయితే ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు తెలిపారని కోదండరాం పేర్కొన్నారు. మంగళవారం సడక్ బంద్ యథావిధిగా కొనసాగుతుందని, ఎక్కడివాళ్లు అక్కడ సడక్ బంద్ లో పాల్గొంటారని, ఆందోళనలకు కుప్పకూలితే.. ఆ ప్రభుత్వం ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటే అని కోదండరామ్ అన్నారు. ఇదిలా సడక్ బందు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ బందు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు మద్దతు విలీనం అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్టీసీ జేఏసీ..విలీనం విఘాతం కల్గిస్తోందన్న ప్రచారంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యమాన్ని మరింత చేస్తున్న ఆర్టీసీ జేఏసీ.. హైదరాబాద్ టు కోదాడ సడక్ బంద్ నిర్వహించాలని నిర్ణయించిందిసడక్ బంద్ లో భాగంగా హయత్ నగర్ లో నిర్వహించే కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు విజయవంతం చేస్తాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పిలుపునిచ్చారు.

Other News

Comments are closed.