సమైక్య జాతీయ స్ఫూర్తిని చాటుదాం….

share on facebook
బిజెపి గిరిజన మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి
            కే. రాంజీ రాథోడ్.
తాండూరు అగస్టు 12(జనంసాక్షి)భిన్నత్వంలో ఏకత్వం భారత దేశ జాతీయ సమైక్యతకు నిదర్శనం అని బిజెపి గిరిజన మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి కే రాంజీ రాథోడ్ వెల్లడించారు. ఆజాదీక అమృత్ మహోత్సవకార్యక్రమంలో భాగంగా బిజెపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికీ జాతీయ జెండా పంపిణీ కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం అంతారం తండా గ్రామంలో గురు వారాం  ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులను ఉద్దేశించి  మాట్లాడుతూ  స్వాతంత్ర సమర యోధులనుస్మరించుకుంటూ వారి త్యాగానికి గుర్తుగా దేశానికి స్వతంత్రం సిద్ధించి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి అయిన సందర్భంగా  సమైక్య జాతీయ భావాన్ని పెంపొందిస్తూ  ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు. అదేవిధంగా భారత దేశం ప్రపంచంలో కెల్ల అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని విభిన్న వర్గాల ప్రజలు ,సంస్కృతి, సంప్రదాయాలు , భాషలు ,ఆచారాలు , మతాలు , ఉన్నప్పటికీ ఐక్యంగా సామాజిక జీవనం కొనసాగిస్తూభినత్వంలో  ఏకత్వం అనే నినాదంతో సమైక్య జాతీయ భావజాలాన్ని చాటి చెప్పుతూ ప్రపంచ దేశాలకు భారత దేశం ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. స్వాతంత్ర సమర యోధుల ఆశయ సాధన కొరకు నవభారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు
యువకులు విద్యార్థులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.