*సి పి ఎస్ రద్దు చేసినందుకు, శ్రీ అశోక్ గెహ్లాట్ కు సెల్యూట్*

share on facebook
కోదాడ మే 24(జనం సాక్షి)
    దేశంలోనే సి పి ఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ ను అమలు చేసిన మొదటి రాష్ట్రం రాజస్థాన్, ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గెహ్లాట్ కు  టి ఎస్ సి పి ఎస్ ఇ యూ సూర్యాపేట జిల్ల ప్రధాన కార్యదర్శి బడుగుల సైదులు, సంఘ బాధ్యులు ” సెల్యూట్ చేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మంగళవారం కోదాడ లో పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. సి పి ఎస్ విధానం వలన ఉద్యోగులు, ప్రభుత్వము నష్టపోతున్న విధానాన్ని,ఆర్టికల్ 309 ద్వారా సి పి ఎస్ ను ఏ విధంగా రద్దు చేయ వచ్చునో ఉన్న అధికారాలను, దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కు లేఖలు రాసి , వివరించి, తద్వారా సి పి ఎస్ రద్దు చేయాలని కోరతానని  ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పడాన్ని  స్వాగతిస్తూ, హర్షం వ్యక్తం చేశారు. రాజస్థాన్ బాటలో తెలంగాణ రాష్ట్రం కూడా సి పి ఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు.ఇట్టి కార్యక్రమం లో సి పి ఎస్ కోదాడ డివిజన్ బాధ్యులు సిరంగి ఏడుకొండలు, పి.ఆంకులయ్య, ఆర్.సతీష్, కె. కరుణాకర్, కె. శ్రీనివాస్, జయంత్, సైదా రావు,శేఖర్, పరిపూర్ణ చారి, సిద్దిక్, ఖాసిం,సురేష్,ముక్తార్.. పాల్గొన్నారు.

Other News

Comments are closed.