స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ను సన్మానం చేసిన బీజేపీ నేతలు.

share on facebook
తొర్రూరు.13 ఆగష్టు (జనం సాక్షి)  మండలం లోని వెలికట్టె గ్రామంలో ఇటీవల ఏపి ఈసెట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మరియు తెలంగాణ సెకెండ్ ర్యాంక్ సాదించిన నాయకుల గంగరాజు-శారద ల కుమారుడు నాయకుల ఉపేందర్ ను ఈరోజు బీజేపీ తొర్రూరు రూరల్ మండలం అధ్యక్షుడు బొచ్చు సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. బీజేపీ రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి పెదగాని సోమయ్య, మరియు రాష్ట్ర వేజ్ బోర్డు చైర్మన్ సామ వెంకట్ రెడ్డి గారలు ఈ రోజు తొర్రూర్ మండలం లోని వెలికట్టె గ్రామంలో నాయకుల ఉపేందర్ ను వారి స్వగ్రృహంలో కలిసి శాలువా కప్పి సన్మానించారు.వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యుల కు మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి పెదగాని సోమయ్య మరియు రాష్ట్ర వేజ్ బోర్డు చైర్మన్ సామ వెంకట్ రెడ్డి లు సంయుక్తంగా మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన ఉపేందర్ కష్టపడి చదువుకుని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం అభినందనీయం అని తెలిపారు.ఉపేందర్ లాంటి మట్టిలో మాణిక్యాలు గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఉన్నారని వారి వెన్నుతట్టి ప్రోత్సాహం అందిస్తే వారు ఉన్నత స్థాయికి ఎదుగుతారు అని తెలిపారు. ప్రభుత్వం ఉపేందర్ లాంటి నిరుపేద కుటుంబానికి చెందిన వారిని అన్ని విధాలా ప్రోత్సాహం, సహకారాలు అందజేసి ఆదుకోవాలని కోరారు.ఉపేందర్ కు ఉన్నత చదువులు విషయం లో సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.ఉపేందర్ స్పూర్తితో నేటి విద్యార్థులు కష్ట పడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శులు పరుపాటి రాం మోహన్ రెడ్డి, రచ్చ కుమార్, తొర్రూరు మున్సిపాలిటీ శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్, జిల్లా నాయకులు పూసాల శ్రీమాన్,రూరల్ మండలం ప్రధాన కార్యదర్శి కొమ్ము రాము తదితరులు పాల్గొన్నారు.
 

Other News

Comments are closed.