హరితహారం ఉద్యోగులకు ప్రోత్సాహం

share on facebook

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): హరితహారంలో ఉత్తమంగా పనిచేసిన ఉద్యోగులకు  గుర్తింపు ఉంటుందని డ్వామా పీడీ అన్నారు. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో నిర్లిప్తతగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. హరితహారం కింద మొక్కలు నాటే లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఆ మేరకు అధికారులు,ఉద్యోగులు పనిచేయాలని, జిల్లాకు మంచి పేరు తీసుకుని రావాలన్నారు. ఇదిలావుంటే హరితహారం ప్రగతిపై డివిజన్‌ అధికారులతో  సవిూక్ష నిర్వహించి తగు సూచనలు చేశారు.  డ్వామా, ఉపాధిహావిూ, అటవీశాఖ, మున్సిపల్‌శాఖల ద్వారా మొక్కల ప్రగతిని సవిూక్షించారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని పరిరక్షించడంలో నిర్లక్ష్యం వహిస్తే తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మండలవారిగా మొక్కలు నాటే లక్ష్యం ఎంత ఉంది.. ఇప్పటివరకు ఎన్ని మొక్కలు నాటారు.. నాటిన మొక్కలకు ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారంటూ అడిగి తెలుసుకున్నారు.

Other News

Comments are closed.