తెలంగాణ అలాయ్‌ బలాయ్‌ 14th

మొట్టమొదటి సారిగా 1930 వ దశకంలోనే చెందిన అయితంరాజు కొండలరావు ఎన్నో యేం డ్లు కృషి చేసి ఉర్దూ – తెలుగు నిఘంటువుని త యారు చేశాడు.ఇదే మొదటమొదటి ఉర్దూ తెలు గు నిఘంటువు. ఆ తర్వాత బిరుదురాజు , కె. గొ పాలరావులు కూడా ఈ నిఘంటువు తయారు చేశారు. అయితే వీటి గురించి చాలా కొద్దిమంది కి మాత్రమే తెలుసు తెలుగు అకాడమీ , తెలుగు విశ్వ విద్యాలయం వారు ప్రత్యేకంగా నిఘంటు శాఖలను ఏర్పాటు చేసుకుని మళ్లీ మళ్లీ నిఘంటువును రూపొందిస్తూ ప్రచురిస్తున్నారు. అ యితే ఈ ఉర్దూ నిఘంటువును మాత్రం ఎవ్వరికి అవసరం లేదనే ధొరణి లొ అందరూ వ్యవహరిస్తు న్నారు .కనీసం ఉర్దూ అకాడమీ అయినా ఈ కా ర్యభారాన్ని వహించినట్లయితే ఉర్దూ తెలుసుకొ గొరే తెలుగు వారికి మేలు చేసినట్లవుతుంది. అలా గని కవిమూర్తి , హీరాలాల్‌ , మోరియా ,కాజోటి రామేశ్వరరావు ఉర్దూ లొ సాహిత్యాన్ని సృజించా రు. ఖమ్మం జిల్లాకు చెందిన సర్వదేవభట్ల నర సింహమూర్తి ‘కవిత్వాన్ని వెలువరించారు.అలాగే ‘మై గరీబ్‌ హు, లహూ కీ లఖీర్‌ ‘ అనే ఆయన ఉర్దూ నవలలు చాలా ప్రసిద్ది పొందాయి .ఈయ న స్వయంగా తెలుగు లొ కూడా రచనలు చేశా డు. ఉర్దూ లొ తక్కువ పదాలతొ ఎక్కువ భావాన్ని చెప్పడానికి వీలుండడంతొ ఆ భాషలో ఈయన రాసిన నవలలు తెలుగులోకి గిడుతూరి సూర్యం, ఊటుకూరి రంగారావు అనువదించినారు. ఈయ న తెలుగులొ రాసిన మహైక , ప్రణిత తెలంగాణ నుంచి వెలువడ్డ తొలి దీర్ఘ కవితలు . ఇవి 1953, 1958 లలొ వెలువడ్డాయి .ఇంతటి ప్రజ్ఞావంతు డి గురించి ఇప్పటికి తరాల వారికి తెలియకుండా పొయింది.అలాగే 1950వ దశకం లొనే ‘జల్జలే’ పేరిటి కథా సంకలనాన్ని ఉర్దూలొ వెలువరించ డానికి ప్రయత్నించిన హీరాలాల్‌ మెరియా తన రచనల్ని చాలావరకు తెలుగులొకి అనువదించే వారు. కాళొజి రామేశ్వరావు ‘షాద్‌ ‘అనే ‘తక ల్లూస్‌ ‘తో కవిత్వాం రాశాడు . అది పుస్తకంగా కూడా అచ్చయింది. గతంలొ ఉర్దూ కథానికల్ని దాశరథి కృష్ణమాచార్య తెలుగులొకి అనువదించా డు .అట్లాగే సి.నారాయణ రెడ్డి ,బిరుదురాజు రామరాజులకు కూడా ఉర్దూ భాషతొ మంచి పరి చయమైంది. వీరేగాకుండా ఇంకా ఎంతో మంది తొలితరం వారు ఉర్దూలొ రచనలు చేశారు ఇప్ప టికీ ఉర్దూ పత్రికలు మాత్రమే చదవగలిగే ‘పెద్దలు ‘ చాలామంది ఉన్నారు. దాశరాథి కృష్ణ మాచార్య తన చిన్నప్పుడు ఎప్పుడు హైదరాబాద్‌ వచ్చినా అగాపురా లొ ఉండే ప్రఖాత్య ఉర్దూ కవి జొష్‌ మలియాబాదీని కలవడం ఒక సంప్రదా యంగా ఉండేదని పలు చోట్ల పేర్కొన్నాడు. దాశరాథి పై ఆయన ప్రబావం కవితల్లొ ప్రస్పుట మవుతుంది. కాళొజి , దాశరాథి ,సుద్దాల దేవ య్య ఆళ్వారుస్వామి లాంటి కవులందరూ ఏడొ నిజామ్‌ని విమర్శించాలంటే అది కేవలం 1938- 48 సంవత్సరాలు మధ్యనే ఉన్నదని గ్రహించాలి. అలాగాకుండా మొత్తం నిజాం వంశానికి దాన్ని ఆపాదిస్తు వారు రాసినట్లుగా అంతర్లీనంగా జరు గుతున్న కుట్రను , దుష్ప్రచారాన్ని అడ్డుకొవాలి.
1940 వ దశకం నాటికి కథలు రాసిన నెల్లూరి కేశవస్వామి (1920- 1984) హైదరాబాద్‌ ‘త హెజీర్‌ ‘ (సంస్కతికి ) కి అద్దం పట్టే రీతిలొ ‘చార్మి నార్‌ కథలు ‘ 1981లొ ప్రచురించాడు.ఇందులొ ‘యుగాంతం’ కథ హైదరాబాద్‌ పోలిసు చర్య దాని పర్యవసానాలు, రజాకార్‌ గా మారిన వ్యక్తి పాకిస్తాన్‌ కు వెళ్లడం ఇతి వృత్తం ,ఈ సంపుటి కలొ కథలు హైదారబాద్‌ లొ హిందూ- ముస్లిం మైత్రిని, వారి సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్నా యి మొత్తం 11 కథులున్న ఈ సంపుటిని తన చిన్న నాటి మిత్రుడు పాకిస్తాన్‌ కు వెళ్లిపోయిన అజ్హర్‌ ఉద్దీన్‌ అహమద్‌ యూనివర్శీటి వారు భార తీయ భాషల్లొ ముస్లిం సంస్కృతిపై వచ్చిన కథల్ని సేకరించి ఇంగ్లీషులోకి అనువదించి ప్రచురిం చారు. సురవరం ప్రతాపరెడ్డి హుస్సేన్‌బీ లాంటి కథలు కూడా ముస్లిమ్‌ సంస్కృతిని ప్రతిబింబించే కథ. హైదరాబాద్‌ లోని తొలితరం తెలుగు రచ యితలపై ఇంగ్లీషు ప్రభావం దాదాపు శూన్యం. అయితే ప్రేమ్‌చంద్‌, కిషన్‌చందర్‌ లాంటి ఉర్దూ రచయితల ప్రభావం అధికంగా ఉండేది. అందుకే మాడపాటి హనుమంతరావు, నెల్లూరి కేశవస్వామి లాంటివారు కిషన్‌చందర్‌ కథలుఅనువదించారు.
చరిత్రగతిలో తెరమరుగైన తెలంగాణ ముస్లిమ్‌ తారీక్‌ ని సాహిత్య వికాసాన్ని సాంస్కృతిక పునరు జ్జీవనాన్ని, ప్రజాచైతన్యానికి వారధులుగా నిలిచిన జమాలుద్దీన్‌ అఫ్ఘానిఈ, మౌల్వి మొహిబ్‌ హుసేన్‌ లు, ముల్లా అబ్దుల్‌ ఖయూమ్‌లను నేటి తరానికి పరిచయం చేయాలి.
ఖిలాఫత్‌ ఉద్యమంలో పాల్గో ని మైసూర్‌లో జైలు శిక్ష అనుభవించిన అమీర్‌ అహ్మద్‌, అతా హుసే న్‌, మహ్మద్‌ అబ్దుర్‌ రెహ్మన్‌ రయీస్‌ల గు రించి నలుగురికి తెలియజెప్పాలి. సబర్మతి ఆశ్రమంలో ఉంటూ ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో వ్యాసాలు వెలువరించిన బద్రుల్‌ హసన్‌ ఖాదీ ఉద్యమానికి, మధ్యపాన నిషేదానికి, సహకా రోద్యమానికి చేసి న సేవలను గుర్తించాలి. పత్రికా స్వేచ్చకోసం ప్రా ణాలర్పించిన షోయెబుల్లాఖాన్‌ గురించి, ఆయన నిజాయితీ గురించి ఈనాటి తరానికి తెలియజెప్పాలి. ఇప్పటికే ఆర్టీసి బస్సు సీట్ల వెనకాల దొంగ చాటుగా రాస్తున్న ‘తురకోని గడ్డం దేశానికి అడ్డం’ ‘తురకదాని బురక దేశానికి మరక’ లాంటి ఉన్మాద నినాదాలు,సినిమాల్లో చూ పిస్తున్నట్లుగా చార్మినార్‌ మీదెక్కి హరేరామ, హరే కృష్ణ అని చేసే నాదాలు రేపు బస్సు మీద రాసి, మసీదు లోపల ఎగిరే ప్రమాదముంది. జాగ్రత్త వహించాలి.
-సంగిశెట్టి శ్రీనివాస్‌
భారతీయ ముస్లింల వెనుకబాటుకు కారణాలు
భారతదేశంలో ముస్లింల వెనుకబాటుతనా నికి సంబంధించి దేశంలో గొప్ప చర్చ జరుగు తోంది. దీనికి వారి మతమే ప్రాథమికంగా కారణ మనే సూత్రీకరణలు వస్తున్నాయి. అలాంటి సూత్రీ కరణలు చేయడం తప్పు. ఇది ఆ సిద్దాంతవేత్త ముస్లిం వ్యతిరేకతను గానీ లేదా అతడు ఈ సమ స్య సామాజిక మూలాలను అర్థం చేసుకోలేకపోవ డాన్ని ప్రతిబింబిస్తుంది. ఏ మతాన్ని అనుసరించే వారి వెనుకబాటుతనానికైనా ఆ మతం కారణమ వదు. అలాంటి సూత్రీకరణలు చాలా స్వల్పమైన వివరణలను యివ్వాలనుకుంటాయి. అవి సామా జిక, ఆర్థిక, సాంస్కృతిక అలాగే మతపరమైన అనే క అంశాలను విస్మరిస్తాయి. అంతేగాక సున్నిత మైన ఏ సామాజిక శాస్త్రవేత్త కూడా ఏ మతాన్ని ఒక సజాతీయమైన యునిట్‌గా పరిగణించజాల రు. అన్ని మతాలు తప్పనిసరిగా విభజించబడి వుంటాయి. ప్రతి గ్రూపు, తెగ, వర్గాలకు వాటి ప్రత్యేకమైన లక్షణాలుంటాయి. ఏ ఒక్క మతంకూ డా మొత్తంగా వెనుకబడిగానీ లేదా అభివృద్ది చెంది వుండవచ్చు. మరొకటి మధ్యస్థంగా వుండ వచ్చు భారతదేశంలోని ముస్లింలందరూ వెనుక బడే వున్నారనే భావాన్ని యిది యివ్వజాలదు. భారతీయ ముస్లింలు వెనుకబడి వున్నారని అర్థం. అదే సమయంలో హిందువులంతా అభివృద్ది చెం దారని కూడా భావించరాదు. ఉన్నత కులాలకు చెందిన లక్షలమంది హిందువులు కూడా షెడ్యూ ల్డ్‌ కులాలు అంటే దళితులతో పాటు నిరక్షురాస్యు లుగా, పేదలుగా వున్నారు. ముస్లింలు, హిందువు లలో కూడా ఒకే మూసలో వున్నవాటిపై పోరాడేం దుకు వీటన్నింటిని గమనంలోకి తీసుకోవడం అవసరం.
సమకాలీన భారతదేశంలో చాలమంది ముస్లిం లు ధనికులుగా, విద్యావంతులుగా, సమాజంలో మంచిస్థానంలో వున్నారని ముందుగా నొక్కి చెప్పా లి. వారు ప్రాంతీయ, కేంద్ర రాజకీయ అధికార వ్యవస్థలో మంచి ప్రభావాన్ని కలిగి వున్నారు. రెండవది, ముస్లింల వెనుకబాటుతనానికి ప్రధాన కారణం వారి సామాజికపునాది అని అర్థం చేసుకోవాలి. మధ్య కాలిక భారతదేశంలో ముస్లిం లందరూ ప్యూడల్‌ పునాదిని కలిగివున్న పాలకవ ర్గాలకు చెందిన వారు కాదు. మధ్యయుగపు భార తదేశంలో అతి కొద్దిమంది ముస్లింలు మాత్రమే పాలక లేదా ఉన్నతవర్గాలకు చెందినవారుగా వున్నారు. భారతీయ ముస్లింలలో అత్యధికులు హిందూ సమాజంలోని శూద్ర కులం నుంచి మతం మార్చుకున్నవారే. బలవంతపు మత మా ర్పిడీ విషయంలోకి వెళ్లకుండా, దళితుల నుంచి జరిగిన ఈ మతమార్పిడీలన్నీ పెద్ద ఎత్తున ప్రధా నంగా ఐచ్చికంగా జరిగినవేనని, బలవంతంగా జరిగినవి కావని చెప్పడమే సరైనది.ఈ రకంగా శూద్రుల నుంచి ఇస్లాంలోకి మారడమే సాధార ణంగా ముస్లింల వెనుకబాటు తనానికి ప్రధాన కారణం. కులాలవారీగా వున్న హిందూమతం కం టే ఇస్లాం మరింత ప్రజాతంత్రయుతంగానూ, సమతాభావంతోనూ వున్నట్లు కన్నించినందుకే ఈ పీడిత ప్రజలు అందులోకి మారారు. ఈ శూద్రుల లో వృత్తుల ఆధారంగా అనేక జాతులుగా విభజిం పబడి వున్నారు. వారిలో నేతపనివారు, కసా యిలు, రజకులు, రంగులు వేసేవారు, పింజా రాలు, సమాధులు తవ్వేవారు, క్షురకులు వున్నారు వీరు ఇస్లాంను స్వీకరించినప్పటికీ ఈ వృత్తులను మానుకోలేదు. ఇక్కడ మారింది కేవలం వారి మతం మాత్రమే. వారి వృత్తి లేదా సామాజిక స్థితి గతులు మారలేదు. ఈ విధంగా ముస్లింలకు మారినవారిని పాలకవర్గాలలో వున్న ముస్లింలు సహజంగానే చిన్నచూపు చూసేవారు. ఉన్నత కుల ముస్లింలను ‘అష్రాఫ్‌’ లు దిగువ కులాలకు చెందిన వారిని ‘అజ్లాఫ్‌’ లు అని పిలవడం ఎరి గున్న విషయమే. ఈ దిగువ కుల ముస్లింలకు ‘కమీన్లు’ అంటూ చులకనగా చూడటం తెలిసిన విషయమే. సుల్తాన్‌ల కాలానికి చెందిన చరిత్ర కారుడు జియాఉద్దీన్‌ వారి సామాజిక మూలాన్ని బట్టే మెజారిటీ ముస్లింలు బాగా వెనకబడి వున్నా రు. ఇలాంటి ముస్లింలే భారత దేశంలో అత్యది కులుగా వున్నారు.తూర్పుబెంగాల్‌ వంటి ప్రాంతా లలో నిరక్షరాస్యత, పేదరికంలో మగ్గుతున్న వారే అత్యధికంగా తొలిరోజుల్లో ఇస్లాం మతాన్ని స్వీక రించారని మానవశాస్త్ర అధ్యయనాలను బట్టి తెలుస్తోంది. పైపెచ్చు వారిలో అత్యధికులు పట్టణ ప్రాంతాల్లో చేతివృత్తిదారులుగానూ, గ్రామీణ ప్రాంతాలలో చిన్న లేదా భూమిలేని రైతులుగా వున్నారు. తొలిరోజుల నాటి ఆంగ్లేయ పౌర ఉద్యో గి డబ్ల్యు డబ్ల్యు హంటర్‌ తన గ్రంథంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. బెంగాల్‌ ముస్లింలు బా గా వెనుకబడి వున్నారని, ప్రభుత్వ సర్వీస్‌లలో వారి ప్రాతినిధ్యం తగినంతగా లేదని ఆయన పేర్కోన్నారు. ఆంగ్లేయుల నుంచి మరిన్ని రాయి తీలు పోందేందుకు ముస్లింలు తరచుగా హంటర్‌ గ్రంథంలోని అంశాలను ఎత్తి చూపేవారు. యు. పీ లో ముస్లింల పరిస్థితి మరీ ఇంత దారుణంగా వుండేది కాదు. అక్కడ అవథ్‌లో ముస్లింపాలన వుండేది. ముస్లిం ప్యూడల్‌ వర్గాలు ఉచ్చస్థితిలో వుండేవి. అక్కడ ప్రభుత్వ సర్వీస్‌లలో వారి ప్రాతి నిధ్యం హెచ్చుగా వుండేది. యు.పీ లో ముస్లిం జనాబా 15 నుంచి 16 శాతం వరకూ వుండేది. విద్య, పోలిస్‌ సర్వీస్‌లలో వారి ప్రాతినిధ్యం 20 శాతం పైగానే వుండేదని పాలట్రాస్‌ అధ్యయనం తెలిపింది. కాబట్టి ముస్లింలు పాలకవర్గంగా ఉన్న చోట ప్రభుత్వ సర్వీస్‌లలో వారి ప్రాతినిధ్యం ఎక్కువగానే వుండేది.
-వేముల ఎల్లయ్య,స్కైబాబ
ఇంకావుంది…