బీసీ రిజర్వేషన్‌ కోసం ఢల్లీిలో పోరు

` ఉద్యమానికి కాంగ్రెస్‌ కార్యాచరణ
` ఆగస్టు 5న పార్లమెంటులో ఎంపీల వాయిదా తీర్మానం, చర్చకు పట్టుబట్టాలని నిర్ణయం
` 6న జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా..7న రాష్ట్రపతికి వినతిపత్రం
` కార్యక్రమాల్లో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, బీసీ సంఘాల నేతలు
` పార్టీలో ఉత్సాహం నింపేందుకు నేటినుంచి వచ్చె నెల 4 వరకు మీనాకి పాదయాత్ర
` ఈ మేరకు సీఎం రేవంత్‌ భేటి అయిన తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌, టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌
` పాదయాత్రతో పాటు పలు అంశాలపై చర్చ
హైదరాబాద్‌(జనంసాక్షి):
హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్‌లపై దిల్లీలో పోరాడేందుకు కార్యాచరణపై చర్చించారు. దాదాపు గంటన్నరపాటు ఈ సమావేశం కొనసాగింది. ఈనెల 31 నుంచి వచ్చే నెల 4 వరకు యథావిధిగా కాంగ్రెస్‌ పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి దిల్లీలో చేపట్టాల్సిన కార్యాచరణ వీరి మధ్య చర్చకు వచ్చింది. ఆగస్టు 5న పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీల వాయిదా తీర్మానం, చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించారు.ఆగస్టు 6న జంతర్‌ మంతర్‌ వద్ద నిర్వహించే ధర్నాలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, బీసీ సంఘాల నేతలు పాల్గొననున్నారు. 7న రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు. ప్రత్యేక రైలులో ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది నేతలు, కార్యకర్తలు దిల్లీకి వెళ్లనున్నారు. దిల్లీ పర్యటన అనంతరం కాంగ్రెస్‌ పాదయాత్ర యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు.
స్థానిక విజయం లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహం
బిసి రిజర్వేషన్లు ప్రకటించినా..రాష్ట్రపతి ఇంకా ఆమోదించలేదు. దీనిపై కేంద్రాన్ని నిందిస్తూ కాంగ్రెస్‌ ఉద్యమకార్యాచరణకు సిద్దం అవుతోంది. ఢల్లీిలో ఆందోళన చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. 42శాతం రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. బిజెపి మాత్రం ఇది ఆమోదయోగ్యం కాదనిచెబుతోంది. అందులో ముస్లిం రిజర్వేషన్లు తొలగించాలని చెబుతోంది. మొత్తంగా ఎవరి రాజకీయం వారిది. ఎవరి ఆలోచన వారిది. ఈ క్రమంలో ఆర్డినెన్స్‌ పాస్‌ కాకుంటే.. మావ్యూహం మాకుందని సిఎం రేవంత్‌ పదేపదే చెబుతున్నారు. అదేంటన్నది ఇప్పుడే తెలియదు. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం స్థానాల్లో విజయం సాధించాల్సిందేనని పట్టుదలతో కాంగ్రెస్‌ పనిచేస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు సందేశాలు వెళ్లాయి. మరోవైపు ఏఐసిసి నాయకురాలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి విూనాక్షి నటరాజన్‌ జూలై31 గురువారం నుంచి పాదయాత్రకు సిద్దం అవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టు-కుని ఈ నెల 31 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకూ తొలి విడత పాదయాత్ర, పల్లె నిద్ర, శ్రమదానం చేయడానికి త్రిముఖ వ్యూహాన్ని ఆమె ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్‌ కుమార్‌ గౌడ్‌తో కలిసి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విూనాక్షి నటరాజన్‌, మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఎమ్మెల్యే క్వార్టర్‌లో సమావేశమయ్యారు.పది ఉమ్మడి జిల్లాల పార్టీ ఇన్‌ఛార్జిలు, పార్లమెంటు వారీగా నియమితులైన ఇన్‌ఛార్జిలుగా నియమితులైన ఉపాధ్యక్షులు, పిసిసి ప్రధాన కార్యదర్శులు, జిల్లా పార్టీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. పాదయాత్రలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలని, జన సవిూకరణ, భారీ ఏర్పాట్లు-, పెద్ద ఎత్తున కార్యకర్తల సమావేశం ఏర్పాటు- చేయడం గురించి విూనాక్షి సూచన చేశారు. ఈ నెల 31న రంగారెడ్డి జిల్లా పరిగిలో సాయంత్రం 5 గంటలకు పాదయాత్రకు ఆమె శ్రీకారం చుట్టనున్నారు. విూనాక్షి నటరాజన్‌తో పాటు- పిసిసి అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ నాయకులు, వివిధ కార్పోరేషన్ల చైర్మన్లూ పాదయాత్రలో పాల్గొంటారు. దీనిని విజయవంతం చేయాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే పార్టీ నాయకులను, కార్యకర్తలు ఆమె పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలో హైకోర్టు ఆదేవాల మేరకు సెప్టెంబర్‌లోగా స్తానిక ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంది. అయితే విూనాక్షి పాదయాత్ర కాంగ్రెస్‌ పార్టీకి ఏ మాత్రం ఉపయోగ పడుతుందో చూడాలి.

తెలంగాణలో మరో కొత్త డిస్కం ఏర్పాటు
` విద్యుత్‌శాఖపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్రంలో మరో విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఎస్‌పీడీసీఎల్‌, ఎన్‌పీడీసీఎల్‌ ఉండగా.. మరో డిస్కం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి, ప్రభుత్వ విద్యా సంస్థలకు, గృహజ్యోతి పథకానికి ఇచ్చే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావాలని చెప్పారు. విద్యుత్‌శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో విద్యుత్‌ శాఖ ప్రక్షాళన కోసం సంస్కరణలు చేపట్టాలి. కొత్త డిస్కం ఏర్పాటు వల్ల ఇప్పుడున్న విద్యుత్‌ పంపిణీ సంస్థల పనితీరు మెరుగుపడి.. జాతీయ స్థాయిలో రేటింగ్‌ పెరుగుతుంది. డిస్కంల పునర్‌వ్యవస్థీకరణతో పాటు విద్యుత్‌ సంస్థలపై ఇప్పుడున్న రుణభారం తగ్గించాలి. రుణాలపై పది శాతం వరకు వడ్డీలు చెల్లిస్తూ డిస్కంలు డీలా పడ్డాయి. తక్కువ వడ్డీలు ఉండేలా రుణాలను రీస్ట్రక్చర్‌ చేసుకునేలా వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యుత్‌ సంస్థల్లో సోలార్‌ విద్యుత్‌ వినియోగాన్ని అందుబాటులోకి తేవాలి. సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటు కోసం అనువైన భవనాలను గుర్తించే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలి’’ అని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.