అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించాలని ధర్నా

కరీంనగర్‌ కలెక్టరేట్‌ , (జనంసాక్షి): అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని, అమృతహస్తం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నడపాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ నాయకులు శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. సకల జనుల సమ్మె వేతనాలతో పాటు పెండింగ్‌ వేతనాలు వేతనాలు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా కలెక్టరుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ, నాయకులు సమ్మయ్య , స్వర్ణలత, సునీత, లావణ్య తదితరులు పాల్గొన్నారు.