అంజిరెడ్డి అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్ : రెడ్డీన్ ల్యాబ్స్ అధినేత డాక్టర్ అంజిరెడ్డి అంత్యక్రియలు హైదరాబాద్ పంజాగుట్ట శ్మశానవాటికలో శనివారం పూర్తయ్యాయి. అంజిరెడ్డి చితికి ఆయన కుమారుడు సతీష్‌రెడ్డి నిప్పంటించారు. వివిధ రంగాల ప్రముఖులు, రాజకీయ నేతలు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, రెడ్డీన్ ల్యాబ్స్ సిబ్బంది అంజిరెడ్డి పార్థీవ దేహానికి నివాళులర్పించి, అంజలి ఘటించారు. కేంద్ర మంత్రులు చిరంజీవి, జైపాల్‌రెడ్డి, బాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మంత్రులు దానం నాగేందర్, టి.జి.వెంకటేష్, సినీ నర్మాత రామానాయుడు. సీఐడీ అడిషనల్ డీజీ కృష్ణప్రసాద్, తదితరులు అంజిరెడ్డికి నివాళులర్పించి ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ జేశారు. బంజారాహిల్స్‌లోని అంజిరెడ్డి నివాసం నుంచి పంజాగుట్ట శ్మశానవాటిక వరకు ఆయన అంతమయాత్ర కొనసాగింది.