అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ

 

 

 

 

 

 

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధి భీమా గార్డెన్స్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు పథకం క్రింద చెక్కులను మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, ఎంఎల్ఏ నడిపెల్లి దివాకర్ రావు, అదనపు కలెక్టర్ రాహుల్ చేతుల మీదుగా బుధవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయమహిళా దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లాలో 8459 సంఘాలకు12.62 కోట్లు మంజూరు కావడం జరిగిందన్నారు. అందులోనుండి మంచిర్యాల నియోజకవర్గంలోని 2932 మహిళా సంఘాలకు రూపాయలు ఐదు కోట్లు వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేసినట్లు పేర్కొన్నారు.
మహిళా సంఘాల సభ్యులు సొంత ఖర్చలకు వాడుకోకుండా వ్యాపారాలు చేసుకుని దినదినాభివృద్ధి చెంది, ఆర్థికంగా ఎదగాలని సందర్భంగా వారు కోరారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్, డి ఆర్ డి ఓ శేషాద్రి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, డి ఆర్ డి ఏ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.