అంతా రసాయనమే..
` కల్తీ కల్లు ఘటనలో భారీ మోతాదులో ‘ఆల్ఫ్రాజోలం’ గుర్తింపు
` బాధితుల సంఖ్య 44కి చేరిక
` పలు దుకాణాల లైసెన్సులు రద్దు
` బాధ్యులను విడిచిపెట్టేదిలేదు: మంత్రి దామోదర రాజనర్సింహ
` మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు చెల్లించాలి
` ఆస్పత్రిలో బాధితులకు మెరుగైన చికిత్స అందించాలి
` ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి: కేటీఆర్
` ఘటనకు బాధ్యత ప్రభుత్వానిదే..: ఎన్.రామచందర్‌రావు
హైదరాబాద్(జనంసాక్షి): నగరంలోని కూకట్‌పల్లి పరిధిలో జరిగిన కల్తీ కల్లు ఘటన నేపథ్యంలో ఎక్సైజ్‌శాఖ అధికారులు విస్త్రృత తనిఖీలు చేపట్టారు. ఐదు బృందాలుగా ఏర్పడి వివిధ కల్లు దుకాణాల నుంచి నమూనాలను సేకరించి.. నారాయణగూడలోని ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించారు. కొన్ని దుకాణాల్లో ఆల్ఫ్రాజోలం మత్తుమందును కలిపి కల్లు కల్తీ చేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో పలు దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేసినట్లు బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
బాధ్యులను విడిచిపెట్టేదిలేదు: మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్ కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో బాధితుల సంఖ్య 44కి చేరింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు- తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రస్తుతం నిమ్స్‌లో 31 మంది, గాంధీ ఆస్పత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్నట్లు- చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో మరో ఏడుగురికి చికిత్స అందిస్తున్నట్లు- చెప్పారు. మంగళవారం కూకట్‌పల్లి పరిధిలోని పలు కల్లు కాంపౌండ్‌లలో కల్తీకల్లు తాగి పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
కల్తీ కల్లులో రసాయనాలు ఉన్నట్లు గుర్తింపు
కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందారు. మొత్తం 37 మంది అస్వస్థతకు గురయ్యారు. నిమ్స్ ఆసుపత్రిలో 31 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 27 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నలుగురికి డయాలసిస్ చేస్తున్నట్లు- చెప్పారు.కూకట్‌పల్లి కల్తీ కల్లు కేసులో ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రెండు రోజుల క్రితమే కల్లు శాంపిళ్లను అధికారులు పరీక్షలకు పంపారు. కూకట్‌పల్లిలోని పలు కల్లు దుకాణాల నుంచి ఈ నమూనాలు సేకరించారు. ఈ క్రమంలో వాటిని ల్యాబ్‌లో పరీక్షించగా.. కాంపౌండ్‌లలో సేకరించిన కల్లులో కెమికల్స్ ఉన్నట్లు గుర్తించారు. రసాయనాలు కలిపిన కల్లు వల్లే అస్వస్థతకు గురైనట్లు అధికారులు నిర్ధరించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఏడుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.
మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు చెల్లించాలి: కేటీఆర్
కూకట్‌పల్లిలో పరిధిలోని కల్తీ కల్లు ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఘటన బాధాకరమన్న ఆయన.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఆస్పత్రిలో ఉన్న బాధితులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలన్నారు. ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండి మెరుగైన చికిత్స అందించాలని కోరుతున్నట్లు కెటిఆర్ తెలిపారు. కుటుంబం కోసం కాయాకష్టం చేసే కష్టజీవులు కల్తీ కల్లు బారిన పడకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. ఇంతమంది చనిపోతే ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తూ కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.
కల్తీకల్లు బాధితులకు 10లక్షల పరిహారం
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు డిమాండ్
కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, బాధితులకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కల్తీ కల్లు ఘటనలో అనధికారికంగా ఆరుగురు మృతి చెందారు. ఒకటి రెండు సీసాల కల్లు తాగిన వారి కిడ్నీలు దెబ్బతిన్నాయి. కల్తీ కల్లులో సైకో ట్రాఫిక్ సబ్ స్టన్స్ కలిపినట్టు- స్పష్టంగా తెలుస్తోంది. ఎ-కై-ª`సజ్ శాఖ కల్లు కాంపౌండ్ వారితో కుమ్మక్కైంది. ఈ ఘటన మొదటిసారి కాదు.. గతంలోనూ వెలుగు చూశాయి. ఎ-కై-ª`సజ్ అధికారులు రోజూ కల్లు కాంపౌండ్‌లలో తనిఖీలు చేయాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వంచర్యలు తీసుకోవాలి‘ అని రామచందర్‌రావు అన్నారు.