అంత్యక్రియలకు ఆర్థిక సహాయం.

పోటో : నగదు అందజేస్తున్న కోవిడ్ వలంటీర్స్ సభ్యులు.
బెల్లంపల్లి, సెప్టెంబర్ 7, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం జెండా వెంకటాపుర్ గ్రామానికి చెందిన గోదారి అనసూర్య బ్రెయిన్ ట్యూమర్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. రెండు రోజుల క్రితం నిరుపేద కుటుంబానికి చెందిన తమకు చికిత్స కోసం ఆర్థిక సాయం చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు కోవిడ్ వాలంటీర్లు రంగంలోకి దిగి దాతల నుంచి చందాలు వసూలు చేశారు. దాతల నుంచి ₹ 6201 జమ అయ్యాయి. వారికి ఆ డబ్బులు ఇవ్వక ముందే మరణించడంతో కనీసం ఆ అమ్మ అంత్యక్రియలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో బుధవారం కోవిడ్ వాలంటీర్ సభ్యులు దూట సత్యం, ఎస్కురి పొశం, అంకయ్య చేతుల మీదుగా మృతి చెందిన అమ్మ కుమారుడు అయిన గోదారి వినయ్ కుమార్ కు అందజేశారు. ఈసందర్భంగా కోవిడ్ వాలంటీర్ల పిలుపు మేరకు స్పందించిన మానవతా మూర్తులందరికి కోవిడ్ వాలంటీర్ల సమన్వయ కర్త జలంపల్లి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.