-->

*అక్టోబర్ 21న విద్యార్థి పోరుగర్జన*

– బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ

మునగాల, సెప్టెంబర్ 30(జనంసాక్షి): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని, అలాగే విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపకార వేతనాలను చెల్లించాలని హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని అలాగే బీసీ హాస్టల్ లకు సొంత భవనాలు నిర్మించాలని బీసీలకు బీసీ బందు ప్రకటించాలని కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించాలనే డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యకు అందజేసి, అక్టోబర్ 21న కోదాడలో విద్యార్థి పోరు గర్జన సభను పెడుతున్నట్లు బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ శుక్రవారం బీసీ భవన్లో ఆర్.కృష్ణయ్యను కలిసి కోదాడలో నిర్వహించే సన్మానించే సభకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి సంగం జిల్లా ఉపాధ్యక్షుడు పొలం పెళ్లి సుధాకర్ గౌడ్ గోపి గౌడ్ సతీష్ ముదిరాజ్ నవీన్ ఇతరులు పాల్గొన్నారు.