అక్రమంగా అరెస్టు చేసిన ఎస్.ఎఫ్.ఐ.నాయకులను విడుదల చేయాలి
జహీరాబాద్ సెప్టెంబర్ 1 (జనం సాక్షి)
ఎస్.ఎఫ్.ఐ. నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి జహీరాబాద్ ఏరియా సహాయ కార్యదర్శి చంద్రవర్ధన్ మాట్లాడుతూ
లింగంపల్లి గురుకుల పాఠశాలలో కరెంట్ షాక్ తో విద్యార్థి చనిపోవడం జరిగింది విద్యా సంస్థలలో గణేష్ మండపాలు ఏర్పాటు చేయాలని పై అధికారులు ఏమైనా ఆదేశాలు ఇచ్చారా విద్యా నేర్పియాల్సిన ప్రిన్సిపాల్ టీచర్స్ పూజలు పురస్కరలు అంటూ గణేష్ మండపాలు ఏర్పాటు చేసి మత కల్లోలం సృష్టిస్తున్నారు దీంతో శాస్త్రీయ విద్యా విధానం మరిచి మూడో విశ్వాసాలకు ఆకర్షం అవుతున్నారు విద్యార్థులు ఈ గణేష్ మండపం ఏర్పాట్లు సందర్భంగా సాయికిరణ్ అనే వ్యక్తి కరెంట్ షాక్ తో చనిపోవడం జరిగింది దీనికి బాధ్యులు ప్రిన్సిపాల్ టీచర్స్ ఎలక్ట్రిషన్ వార్డెన్ వర్కర్స్ కావున కరెంట్ షాక్కుకుగురైన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని ఆ కుటుంబంలో ఇద్దరికీ ఉద్యోగాలు కల్పించాలని ఎక్స్గ్రేషియా 50 లక్షలు ఇవ్వాలని న్యాయమైన డిమాండ్లతో స్కూల్ ముందు విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయడంతో అక్రమంగా అరెస్టులు చేసి మునిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించడం సిగ్గుచేటు వెంటనే అరెస్టు అయిన ఎస్.ఎఫ్.ఐ.నాయకత్వాన్ని విడుదల చేయాలని లేనియెడల జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు….