అక్రమంగా నిల్వచేసిన మద్యం స్వాధీనం

హైదరాబాద్‌: నగరంలోని రాజేంద్రనగర్‌ బుద్వేల్‌ అక్రమ మద్యాన్ని ఎక్సైజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుద్వేల్‌లోని ఓ ఇంటిలో అక్రమంగా నిల్వచేసిన రూ.15 లక్షలు విలువచేసే 508 కాటన్‌ల లిక్కర్‌ను అధికారులు గుర్తించారు. అక్రమంగా నిల్వచేసిన వారు పరారు కాగా, మద్యాన్ని సీజ్‌ చేశారు. త్వరలో మద్యం రెట్లు పదిశాతం పెరగనున్న నేపథ్యంలో లిక్కర్‌ పెద్దయెత్తున దాచారా లేక కల్తీ మద్యామా అనే విచారణలో తేలుతుందని ఎక్సైజ్‌     అధికారులు తెలియజేశారు.